పాకిస్థాన్‌లో కాల్పులు.. పదేళ్ల విదేశీ చిన్నారి మృతి | pakistan australian child shot dead in police shooting | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌లో కాల్పులు.. పదేళ్ల విదేశీ చిన్నారి మృతి

Jun 15 2026 1:42 PM | Updated on Jun 15 2026 3:51 PM

pakistan australian child shot dead in police shooting

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒక పోలీసు అధికారి చేసిన పొరపాటుతో పదేళ్ల ముక్కపచ్చలారని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దొంగతనానికి సంబంధించిన ముఠాను ఛేదిస్తున్న క్రమంలో జరిపిన కాల్పుల్లో పోరపాటున విదేశీయులకు బుల్లెట్లు తగిలాయి. ఈ ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన బాలిక  అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఒక పోలీసు అధికారిని అరెస్టు చేశారు.

పంజాబ్ పోలీసుల కథనం ప్రకారం,  దోపిడీ జరిగినట్లు సమాచారం రావడంతో పోలీసులు వెను వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో అనుమానితులు కుటుంబ కారులో పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని ఒక కుటుంబానికి చెందిన వాహనాన్ని అడ్డగించారు. వారు ఆపకపోవడంతో  అధికారి పొరపాటుగా భావించి కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. అయితే ఈకాల్పుల ఘటనలో దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియాకు చెందిన  10 ఏళ్ల హానియా అనే బాలిక మరణించగా, ఆమె తండ్రి, సోదరుడు గాయపడ్డారని తెలిపారు. దీంతో ఈ కాల్పులకు కారణమైన అధికారని పోలీసులు అరెస్టిు చేశారు.

కాగా ఆస్ట్రేలియా పెర్క్‌కు సంబంధించిన బాధితులు పాకిస్థాన్‌లోని తమ బంధువులను కలవడానికి వచ్చారని ఆ సమయంలో కాల్పులు జరిగాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఆస్ట్రేలియ ప్రధాని ఆంటోనియా ఆల్బనీస్‌ విచారం వ్యక్తం చేశారు. దీనిపై పారదర్శకమైన విచారణ జరగాలని కోరారు. గాయపడిన వారికి ఆస్ట్రేలియా కాన్సులేట్  సహాయం అందిస్తున్నట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement