Canada: ఆరుగురితో వెళ్తున్న ఎయిర్‌ అంబులెన్స్‌ గల్లంతు! | Ontario air ambulance with 6 onboard goes missing | Sakshi
Sakshi News home page

Canada: ఆరుగురితో వెళ్తున్న ఎయిర్‌ అంబులెన్స్‌ గల్లంతు!

Oct 4 2026 7:25 AM | Updated on Oct 4 2026 7:25 AM

Ontario air ambulance with 6 onboard goes missing

ఒట్టావా: కెనడాలోని ఒంటారియోకు చెందిన మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ నిర్వహిస్తున్న లాటిట్యూడ్ ఎయిర్ అంబులెన్స్  గల్ఫ్‌స్ట్రీమ్ జీ100 విమానం అమెరికా తీర ప్రాంతంలో అదృశ్యమైంది. నాన్‌టుకెట్ సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ విమానంతో సంబంధాలు తెగిపోయాయి. విమానం అదృశ్యమయ్యే సమయానికి ఇది వైద్య రవాణా ఆపరేషన్‌లో ఉంది. ఈ విమానంలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో నలుగురు కెనడా పౌరులు కాగా, ఇద్దరు పైలట్లు, ఇద్దరు వైద్య సిబ్బంది, ఒక రోగి, ఆ రోగి వెంట వచ్చిన కుటుంబ సభ్యుడు ఉన్నారు. ఈ వివరాలను లాటిట్యూడ్ ఎయిర్ అంబులెన్స్ సంస్థ ప్రతినిధి క్లారెన్స్ టోగెరెట్జ్ తెలిపారు.

రోగిని బోస్టన్‌లోని ఆసుపత్రికి తరలించే క్రమంలో ఈ విమానం బెర్ముడాలోని ఎల్ఎఫ్ వేడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. ఫ్లైట్‌అవేర్ వివరాల ప్రకారం దాదాపు రెండు గంటల పాటు సాగాల్సిన ఈ ప్రయాణం అర్థాంతరంగా నిలిచిపోయి, విమానం రాడార్ నుంచి తప్పిపోయింది. యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ)విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు వెల్లడించిన వెంటనే అమెరికా కోస్ట్ గార్డ్ గాలింపు, రక్షణ చర్యలను చేపట్టింది. ఈ ఘటనపై బెర్ముడా ప్రీమియర్ డేవిడ్ బర్ట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విమానంలో ఉన్నవారి కుటుంబాలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. 

ఇదీ చదవండి: ఆ రెండు విమాన ప్రమాదాలు.. కాక్‌పిట్‌ రూల్స్‌నే మార్చేశాయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement