ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు టెల్ అవీవ్‌లో లేరా? ఉన్నఫళంగా ఆయన క్రీట్ ద్వీపానికి పయనమయ్యారా? ఈ ప్రశ్నలకు అరబిక్ మీడియా ఔననే సమాధానం చెబుతోంది. albawaba.com అనే మీడియా సంస్థ ఏకంగా ఓ అడుగు ముందుకేసి.. నెతన్యాహు పారిపోయాడంటూ కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను ఉటంకించింది.
ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి బోయింగ్ 767 (4ఎక్స్-ఐఎస్ఆర్) విమానం గుర్తుతెలియని గమ్యస్థానానికి చేరుకుంది. బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం గ్రీస్‌లోని క్రీట్ ద్వీపంలోని హెరాక్లియోన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరో అరబిక్ వార్తాసంస్థ ఈ విమానం ఏథెన్స్ విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు పేర్కొంది.
ఈ విమానం బెంజమిన్ నెతన్యాహుకు చెందిన ‘వింగ్ ఆఫ్ జియాన్’ అని ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను ఉటంకిస్తూ మరికొన్ని అరబిక్ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. గురువారం ఉదయం 11.22కు టేకాఫ్ అయిన విమానం.. మధ్యాహ్నం 1.06కు గ్రీస్‌లో ల్యాండ్ అయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. ఇరాన్ దాడి చేసే అవకాశాలుండడంతో ఇజ్రాయెల్ చీఫ్ గ్రీస్‌కు వెళ్లిపోయాడంటూ ఆ కథనాలు పేర్కొంటున్నాయి. అయితే.. ‘వింగ్ ఆఫ్ జియాన్’లో నెతన్యాహు ఉన్నారా? లేదా? అనే విషయాలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
Prime Minister Netanyahu’s aircraft, Wing of Zion, has taken off from Israel.
Israeli assessments say this could be a sign that a strike on Iran is very close.
They note that ahead of the previous strike on Iran, Wing of Zion also departed just hours before the operation. pic.twitter.com/7P1sNVVdMQ— Reeve Breskin (@reevbreskin) January 14, 2026


