breaking news
flight data recorder
-
నెతన్యాహు క్రీట్‌కు పారిపోయాడు..!: అరబిక్ మీడియా
ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు టెల్ అవీవ్‌లో లేరా? ఉన్నఫళంగా ఆయన క్రీట్ ద్వీపానికి పయనమయ్యారా? ఈ ప్రశ్నలకు అరబిక్ మీడియా ఔననే సమాధానం చెబుతోంది. albawaba.com అనే మీడియా సంస్థ ఏకంగా ఓ అడుగు ముందుకేసి.. నెతన్యాహు పారిపోయాడంటూ కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను ఉటంకించింది.ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి బోయింగ్ 767 (4ఎక్స్-ఐఎస్ఆర్) విమానం గుర్తుతెలియని గమ్యస్థానానికి చేరుకుంది. బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం గ్రీస్‌లోని క్రీట్ ద్వీపంలోని హెరాక్లియోన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరో అరబిక్ వార్తాసంస్థ ఈ విమానం ఏథెన్స్ విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు పేర్కొంది. ఈ విమానం బెంజమిన్ నెతన్యాహుకు చెందిన ‘వింగ్ ఆఫ్ జియాన్’ అని ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను ఉటంకిస్తూ మరికొన్ని అరబిక్ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. గురువారం ఉదయం 11.22కు టేకాఫ్ అయిన విమానం.. మధ్యాహ్నం 1.06కు గ్రీస్‌లో ల్యాండ్ అయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. ఇరాన్ దాడి చేసే అవకాశాలుండడంతో ఇజ్రాయెల్ చీఫ్ గ్రీస్‌కు వెళ్లిపోయాడంటూ ఆ కథనాలు పేర్కొంటున్నాయి. అయితే.. ‘వింగ్ ఆఫ్ జియాన్’లో నెతన్యాహు ఉన్నారా? లేదా? అనే విషయాలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. Prime Minister Netanyahu’s aircraft, Wing of Zion, has taken off from Israel.Israeli assessments say this could be a sign that a strike on Iran is very close.They note that ahead of the previous strike on Iran, Wing of Zion also departed just hours before the operation. pic.twitter.com/7P1sNVVdMQ— Reeve Breskin (@reevbreskin) January 14, 2026 -
ఎయిర్ క్రాఫ్ట్ డాటా రికార్డర్ లభ్యం..
న్యూఢిల్లీ : నెల రోజుల కిందట అదృశ్యమైన కోస్ట్ గార్డుల డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ కు చెందిన డాటా రికార్డర్ చెన్నై తీరంలో లభ్యమైంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించి కీలక విషయాన్ని కనుగొన్నామని పేర్కొంది. గత నెల 8న డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ అదృశ్యమైన విషయం తెలిసిందే. చివరగా అదే రోజు రాత్రి 9 గంటల తర్వాత చిదంబరం తీరానికి 16 కిలోమీటర్ల దూరంలో దానిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. డిప్యూటీ కమాండెంట్ విద్యాసాగర్, బోర్డు డిప్యూటీ కమాండెంట్ ఎంకే సోని, కో పైలట్ - డిప్యూటీ కమాండెంట్ సుబాష్ సురేష్ లు ఎయిర్ క్రాఫ్ట్ తో సహా అదృశ్యమైన విషయం విదితమే. డోర్నియర్ ను వెతకడానికి 10 షిప్పులు, ఐఎన్ఎస్ సింధూరక్షక్లను వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. -
ఎయిర్ ఏసియా బ్లాక్ బాక్స్ స్వాధీనం
జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్సును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విచారణ నిమిత్తం పంపినట్లు సార్ (ఎస్ఏఆర్) ఆపరేషన్స్ డైరెక్టర్ సుప్రియాది తెలిపారు. జాతీయ రవాణా భద్రతా కమిటీ చీఫ్ ద్వారా సమాచారం అందిందని, బ్లాక్ బాక్స్ తన చుట్టూ 20 మీటర్ల పరిధిలో జరిగిన విషయాలను రికార్డు చేస్తుందని ఆయన చెప్పారు. బ్లాకు బాక్సులో డాటా రికార్డర్, వాయిస్ రికార్డర్ అనే రెండు విభాగాలు ఉంటాయి. బాక్సుల బ్యాటరీల్లో 30 రోజుల వరకు సమాచారం నిల్వ ఉంటుంది. విమానం తోక భాగంలో ఉండే బ్లాక్ బాక్స్ లో పైలట్ల సంభాషణలు, ఇతర సమాచారం రికార్డు అవుతాయి. కనుక ప్రమాద వివరాలు త్వరలోనే వెలుగు చూస్తాయని అధికారులు భావిస్తున్నారు. విమానంలో ఉన్న మొత్తం 162 మంది ప్రయాణికుల్లో ఇంతవరకు 48 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాల ఆచూకీ కనుగొనేందుకు ఇండొనేషియా రవాణా మంత్రి ఇగ్నేసియస్ జోనన్ నిధులను కేటాయించారు.


