Jennifer MeyerGeoff OgunlesiMarriage ప్రముఖ సెలబ్రిటీ జ్యూవెల్లరీ డిజైనర్, నటుడు టోబీ మాగ్వైర్ (Tobey Maguire) మాజీ భార్య జెన్నీఫర్ మేయర్ (Jennifer Meyer) 49 ఏళ్ల వయసులో మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. జెన్నిఫర్ తన కంటే 14 ఏళ్లు చిన్నవాడైన జియోఫ్ ఒగున్లెసి (Geoff Ogunlesi)ని రెండవ వివాహం చేసుకోబోతున్నారు. హాలీవుడ్ దిగ్గజం రాన్ మేయర్ కుమార్తె అయిన జెన్నిఫర్, గత మూడేళ్లుగా 'బ్లాక్‌రాక్' (BlackRock) సంస్థకు చెందిన ప్రముఖ వ్యక్తి అడెబాయో ఒగున్‌లేసి కుమారుడైన జియోఫ్‌తో కలిసి ఉంటున్నారు. ఈ జంట ఈ వారాంతంలో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.
జెన్నీఫర్ మేయర్ (1977) జియోఫ్ ఒగున్లెసి (1990) మధ్య దాదాపు 14 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. జెన్నిఫర్ ఒగున్లేసిల మధ్య సంబంధం గురించి 2023లో వార్తలు గుప్పుమన్నాయి. ఆ తరువాత అదే ఏడాది బేబీ2బేబీ గాలాలో జంటగా రెడ్ కార్పెట్‌పై తొలిసారిగా కనిపించి ఈ వార్తలకు మరింత ఊతమిచ్చారు. ఎట్టకేలకు 2024లో నిశ్చితార్థం చేసుకోవడం మాత్రమే కాదు, 2025లో తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించిన ఈ జంట, 2026 ప్రారంభంలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 49 ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి కావడం తనకు ఒక కల. నిజమైన అనుభూతిని ఇచ్చిందని జెన్నీఫర్ ఆనందం వ్యక్తం చేశారు.

జియోఫ్ ఒగున్లెసి ఎవరు?
34 ఏళ్ల జియోఫ్ ఒగున్లెసి నైజీరియన్ సంతతికి చెందిన పెట్టుబడిదారుడు. బ్లాక్‌రాక్ (BlackRock) దిగ్గజం అడేబాయో ఒగున్లెసి కుమారుడు. తండ్రి లాగా ఫైనాన్స్ వైపు కాకుండా జియోఫ్ సంగీత రంగాన్ని ఎంచుకున్నారు. మొదట వార్నర్ మ్యూజిక్ గ్రూప్, 300 ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఏ & ఆర్ విభాగంలో పనిచేసిన ఆయన, 2022లో "ది ఒగున్లెసి గ్రూప్" అనే స్వంత మ్యూజిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను స్థాపించారు.
ఇదీ చదవండి: సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం
మొదటి భర్త
తొమ్మిదేళ్ల వివాహ బంధం తర్వాత, జెన్నిఫర్ 2016లో నటుడు టోబీ మాగ్వైర్‌తో విడిపోయారు. 2020లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా, 2026లో వారికి అధికారికంగా విడాకులు పొందినప్పటికీ.. జెన్నీఫర్‌కు, టోబీకి మంచి స్నేహబంధం ఉందనే చెప్పుకోవచ్చు. వీరికి రూబీ అనే కుమార్తె, ఓటిస్ అనే కుమారుడు ఉన్నారు.
ఇదీ చదవండి : ప్రభుత్వ ఉద్యోగం వద్దని నెలకు రూ. లక్ష సంపాదిస్తున్న బార్బర్


