సీజేపీ ఫౌండర్‌ అభిజీత్‌ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం | CJP Founder Abhijeet Dipke Grandmother Dies In Maharashtra Amid Jantar Mantar Protest | Sakshi
Sakshi News home page

సీజేపీ ఫౌండర్‌ అభిజీత్‌ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం

Oct 10 2026 3:22 PM | Updated on Oct 10 2026 3:32 PM

CJP Founder Abhijeet Dipke's Grandmother Dies In Maharashtra

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞనేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)  ఢిల్లీలో  జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టిన ఉద్యమం తీవ్ర ఆందోళనల మధ్య కొనసాగుతుండగా, వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఇంట్లో తీవ్ర విషాదం  చోటు చేసుకుంది. దీప్కే నాయనమ్మ మహారాష్ట్రలోని హింగోలి జిల్లా, సంతుక్ పింప్రి గ్రామంలో శనివారం కన్నుమూశారు.

దీప్కే తండ్రి భగవాన్ దిప్కే తల్లి దీర్ఘకాలిక అనారోగ్యం, వృద్ధాప్య సంబంధిత సమస్యల కారణంగా ఆమె గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆమె కన్నుమూసే  సమయానికి అభిజీత్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో నిరసనలో పాల్గొనేందుకు ఆయనశనివారం ఉదయం ముంబై నుండి బయలుదేరారు. అయితే, ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వగానే ఢిల్లీ పోలీసులు విమానం లోపలికి వచ్చి అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి : ప్రభుత్వ ఉద్యోగం వద్దని నెలకు రూ. లక్ష సంపాదిస్తున్న బార్బర్‌

మరోవైపు, దిప్కే తల్లిదండ్రులు అనిత ,భగవాన్ దిప్కే ప్రస్తుతం ఛత్రపతి సంభాజీనగర్‌లో ఉన్నారు; వారి నివాసం బయట పోలీసులు మోహరించారు. మరణ వార్త తెలిసిన తర్వాత, అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వారు వెంటనే హింగోలికి బయలుదేరే అవకాశం ఉంది. తన నాయనమ్మ మరణం తర్వాత, హింగోలికి వెళ్లేందుకు ఢిల్లీ పోలీసులు అభిజీత్ దిప్కేను అనుమతిస్తారా లేదా అనేది  ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: వామ్మో, ఇసుక లారీ అమాంతం గుద్దేస్తే.. ! చిల్లింగ్‌ వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement