ముంబై: మహారాష్ట్రలోని అహిల్యానగర్ లో జరిగిన ఒక భయానక రోడ్డు ప్రమాదంలో ఒక యువతి అనూహ్యంగా ప్రాణాలతో బయటపడింది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన దృశ్యాలుచూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అంతటి ప్రమాద క్షణాల్లో కూడా ఆమె స్పందించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.
అహిల్యానగర్‌లోని బేలాపూర్ రోడ్డులో ఇసుకతో వెళ్తున్న ఒక ఇసుకలారీ వేగంగా వచ్చి, అకస్మాత్తుగా కుడివైపునకు తిరిగింది. సిగ్నల్ ఇవ్వకుండా, హారన్ కొట్టకుండా, వేగం తగ్గించకుండా విచక్షణా రహితంగా ఎదురుగా దూసుకొచ్చిన లారి స్కూటర్‌ను ఢీకొట్టింది. లారీ ఢీకొట్టిన వెంటనే ఆమె ఎగిరి పడింది. ఇక్కడే ఆమె బుర్ర చాలాచురుగ్గా పనిచేసింది.
ఇదీ చదవండి : ప్రభుత్వ ఉద్యోగం వద్దని నెలకు రూ. లక్ష సంపాదిస్తున్న బార్బర్
A terrifying CCTV video from Shrirampur shows a girl narrowly escaping death after a sand-laden truck hit her scooter on Belapur Road. She grabbed the truck’s front bumper to avoid being run over. The driver allegedly argued with her instead of helping and fled after bystanders arrived. #Shrirampur #Maharashtra #CCTVFootage #NarrowEscape
— Whats In The News (@_whatsinthenews) October 10, 2026
ఆ యువతి ఏ మాత్రం భయపడిపోకుండా, అత్యంత చాకచక్యంగా లారీ బంపర్‌ను గట్టిగా పట్టుకుంది. దీనివల్ల ఆమె లారీ కింద పడిపోవడం, బలంగా నేల మీద పడి, తీవ్ర మైన గాయాల పాలుగాకుండా ప్రాణాలుదక్కించుకోగలిగింది.
ప్రమాదం నుండి తేరుకున్న ఆ యువతి లేచి పక్కకు నడిచివెళ్లగా, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ బయటకు వచ్చి స్కూటర్‌ను పరిశీలించి, అక్కడివారితో వాగ్వాదానికి దిగాడు. అయితే ప్రజలు గుమిగూడటంతో డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు.
స్పందించిన స్థానికులు
ఈ లారీకి నంబర్ ప్లేట్ లేదని, ఇది వైజాపూర్‌లోని మహల్‌గావ్ ఇసుక వేలానికి సంబంధించినదిగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి పర్మిట్లు లేకుండా తిరుగుతున్న ఈ ఇసుక లారీల వేగం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై కఠినమైన పోలీసు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


