టోక్యో: పురుషులు మాత్రమే చక్రవర్తి కాగలరని నిర్దేశిస్తూ, 19వ శతాబ్దపు రాజవంశ చట్టానికి జపాన్ పార్లమెంట్ శుక్రవారం చారిత్రాత్మక సవరణను ఆమోదించింది. భవిష్యత్ వారసుల కోసం దూరపు మగ బంధువులను దత్తత తీసుకోవడం, అలాగే యువరాణులు సామాన్యులను వివాహం చేసుకున్న తర్వాత కూడా తమ రాజ హోదాను నిలుపుకోవడానికి అనుమతించడం వంటివి ఈ సవరణలలో ఉన్నాయి.
ఇది ఇప్పటికే కుంచించుకుపోతున్న రాజకుటుంబాన్ని మరింత ప్రమాదంలో పడేస్తుందనే భయాన్ని రేకెత్తిస్తోంది. దీంతో ప్రభుత్వ ప్రయత్నాలు మహిళలపై వివక్షను, పితృస్వామ్య వ్యవస్థను సమర్థించడానికేనని పలువురు విమర్శిస్తున్నారు. పురుష వారసత్వంపై ఉన్న వ్యామోహానికి ప్రధాన ప్రతిపాదకురాలిగా మొదటి మహిళా ప్రధానమంత్రి ఉండటం చాలా విడ్డూరమని ప్రముఖ స్త్రీవాద పండితురాలు చిజుకో ఉనో ఇటీవల తకైచిని ఉద్దేశించి రాశారు. పురుష రాజవంశీకులను అశ్వాలుగా, మహిళా రాజవంశీకులు మగ సంతానాన్ని కనే యంత్రాలుగా పరిగణిస్తూ ఒత్తిడికి గురిచేస్తాయని ఉనో అన్నారు.


