ఇంజన్‌ వైఫల్యంతో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ లాంచ్‌ రద్దు  | SpaceX Scrubs Launch of Starship Rocket After Engine Failure | Sakshi
Sakshi News home page

ఇంజన్‌ వైఫల్యంతో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ లాంచ్‌ రద్దు 

Jul 18 2026 4:37 AM | Updated on Jul 18 2026 4:37 AM

SpaceX Scrubs Launch of Starship Rocket After Engine Failure

శాన్‌ ఆంటోనియో: స్పేస్‌ఎక్స్‌ తన అత్యంత ప్రతిష్టాత్మక స్టార్‌షిప్‌ రాకెట్‌ ప్రయోగాన్ని చివరి క్షణంలో రద్దు చేసింది. ఈ ప్రయోగం సమయంలో ఇంజిన్‌ సరిగ్గా స్టార్ట్‌ కాకపోవడం, కొన్ని ఇంజన్లు విఫలం కావడంతో టేకాఫ్‌కు కొన్ని సెకన్ల ముందు ఆటోమేటిక్‌ లాంచ్‌ సిస్టమ్‌ను నిలిపివేసింది. టెక్సాస్‌–మెక్సికో సరిహద్దులోని స్టార్‌బేస్‌ వద్ద జరగాల్సిన ఈ లాంఛింగ్‌ నింగిలోకి ఎగరడానికి మూడు సెకన్ల ముందే ఇంజిన్‌ మండటం ప్రారంభమైనట్లు ప్రయోగ వేదిక పైనుంచి తీసిన డ్రోన్‌ దృశ్యాల్లో కనిపించింది.

 మండిన ఇంజన్లు అకస్మాత్తుగా ఆగిపోయాయి. రాకెట్‌ ప్యాడ్‌కు అతుక్కుపోయి ఉండిపోయింది. ఆ తర్వాత ప్రయోగ బృందం వెంటనే రాకెట్‌ నుంచి ఇంధనాన్ని తీసివేయడం ప్రారంభించింది. మరికొన్ని రోజుల్లోనే తదుపరి ప్రయోగ ప్రయత్నం ఉంటుందని ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ‘ఇంజన్‌ పాక్షికంగా మండే వరకు, వాతావరణంతో సహా ప్రతిదీ స్పేస్‌ఎక్స్‌కు అనుకూలంగానే సాగిందన్నారు. ప్రణాళిక ప్రకారం గంటసేపు సాగే ఈ ప్రయాణంలో, రాకెట్‌లోని 20 స్టార్‌లింక్‌లను విడుదల చేయాల్సి ఉంది. అవి అప్పటికే కక్ష్యలో ఉన్న స్టార్‌లింక్‌లతో సంభాషించడానికి ప్రయత్నిస్తూనే, స్టార్‌షిపహీట్‌ షీల్డ్‌ చిత్రాలను కూడా తీయాల్సి ఉంది. 

మొదటి దశ బూస్టర్‌ను గానీ, అంతరిక్ష నౌకను గానీ తిరిగి పొందాల్సిన అవసరం లేదు, రెండూ సముద్రంలోనే పడిపోతాయని భావించారు.  ఈ ఆలస్యం స్పేస్‌ఎక్స్‌ ఉపగ్రహ ప్రణాళికలు, నాసా భవిష్యత్‌ చంద్ర కార్యక్రమంపై ప్రభావం చూపనుంది. ఈ ఎదురుదెబ్బతో అసలు సమస్య ఏమిటో పరీక్షించే పనిలో స్పేస్‌ఎక్స్‌ పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైనదిగా ప్రచారంలో ఉన్న ఈ రాకెట్, ప్రపంచం చుట్టూ సగం దూరం ప్రయాణించే తన 13వ యాత్రను చేయాల్సి ఉంది. ఈ మిషన్‌లో, 20 సరికొత్త స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ ఉపగ్రహాలను కూడా తీసుకువెళ్లాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement