Video: బందీల పిల్లలను ఆడిస్తున్న హమాస్‌ ఉగ్రవాదులు | Infant In Pram Rifles In Hand: Hamas Video Of Babies Taken From Israel | Sakshi
Sakshi News home page

Video: బందీల పిల్లలను ఆడిస్తున్న హమాస్‌ ఉగ్రవాదులు

Oct 14 2023 2:49 PM | Updated on Oct 14 2023 3:13 PM

Infant In Pram Rifles In Hand: Hamas Video Of Babies Taken From Israel - Sakshi

హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ మధ్య ప్రస్తుతం యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరు వైపుల భారీ ప్రాణ న‌ష్టం జ‌రిగింది. హ‌మాస్ దాడుల వ‌ల్ల ఇజ్రాయిల్‌లో 1300 మంది, ఇజ్రాయిల్ దాడుల్లో 1900 మంది హ‌మాస్ ఉగ్ర‌వాదులు హతమయ్యారు. వారం రోజుల క్రితం ఇజ్రాయెల్‌పై కాల్పులు ప్రారంభించిన హమాస్‌ మిలిటెంట్లు.. ఆదేశానికి చెందిన 150 మందికి పైగా పౌరులను బంధించి గాజాకు తరలించిన విషయంతెలిసిందే. 

తాజాగా హమాస్‌ మిలిటెంట్లు ఆధీనంలో బంధీలుగా ఉన్న చిన్నారులకు  దీలకు సంబంధించిన ఓ వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ చేతిలో తుపాకీలు పట్టుకొని ఉన్న హమాస్‌ మిలిటెంట్లు మరోచేత బందీల పిల్లలను ఆడిస్తూ,  కనిపిస్తున్నారు.  చిన్నారులు ఏడుస్తుండగా వారిని ఉయ్యాలలో ఊపుతూ, వారికి తాగడానికి నీళ్లు అందిస్తూ ఉండటం కూడా కనిపిస్తోంది. మిలిటెంట్ల వద్ద కనిపిస్తున్న పిల్లలందరూ నాలుగు నుంచి ఆరేళ్ల లోపు వయసు వారే ఉన్నారు. 

ఈ వీడియోను హమాస్‌ ముందుగా  తమ టెలిగ్రామ్‌ ఛానల్‌లో పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ మిలిటెంట్లు అనేక అకృత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం, తమపై వ్యతిరేకత పెరుగుతున్న వేళ.. బందీలను తాము క్షేమంగానే చూసుకుంటున్నామనే సందేశాన్నిచ్చేందుకే హమాస్‌ ఈ వీడియోను విడుదల చేసినట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అయితే ఇదే వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ‘హమాస్‌ చెరలో బందీ అయిన ఈ పిల్లలకు గాయాలయ్యాయి. వారు ఏడుస్తున్నారు. భయపడుతున్నారు. ఈ ఉగ్రవాదులనే మేము ఓడించబోతున్నాం’’ అని తెలిపింది..

Advertisement
 
Advertisement
Advertisement