యూకే వైమానిక స్థావరంపై ఉగ్రదాడి భగ్నం!  | Five men arrested over terror plot at UK air force base | Sakshi
Sakshi News home page

యూకే వైమానిక స్థావరంపై ఉగ్రదాడి భగ్నం! 

Sep 28 2026 6:17 AM | Updated on Sep 28 2026 6:17 AM

Five men arrested over terror plot at UK air force base

ఐదుగురి అరెస్ట్‌

లండన్‌: ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా ఉపయోగించుకుంటున్న బ్రిటన్‌లోని వైమానిక స్థావరం వద్ద ఆదివారం పోలీసులు ఒక ఉగ్రదాడి కుట్రను భగ్నంచేశారు. గ్లౌసెస్టర్‌షైర్‌ గ్రామ సమీపంలో ఉన్న ఫెయిర్‌ఫోర్డ్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ను పేల్చేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. పేలుడుపదార్థాలను తరలిస్తున్నట్లుగా భావిస్తున్న మూడు వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. వాహనాల్లోని ఐదుగురు అనుమానితులను అరెస్ట్‌చేశారు. 

వాహనాల్లోని పేలుడు పదార్థాలు పేలితే వినాశనం తప్పదని, ముందు జాగ్రత్తగా సమీప 85 ఇళ్లను ఖాళీ చేయించారు. వేగంగా స్పందించి ముప్పును నివారించిన పోలీసు ప్రత్యేక బృందాలను బ్రిటన్‌ రక్షణ మంత్రి వెస్‌ స్ట్రీటింగ్‌ ప్రశంసించారు.  ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు మొదలవ్వడం తెల్సిందే. 

అమెరికా తన బీ–1బీ వంటి శక్తివంతమైన యుద్ధ విమానాలను ఈ స్థావరం నుంచే ఇరాన్‌పై దాడులకు పంపుతోంది. అమెరికాకు సాయపడే దేశాల సైనిక స్థావరాలపై దాడులు తప్పవంటూ జూలైలో హెచ్చరికలు చేసిన ఇరాన్‌లోని ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ లేదా రష్యా అనుకూల శక్తులు ఈ స్థావరంపై దాడికి యతి్నంచి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement