పేగు క్యాన్సర్‌ బాధితులకు వ్యాయామంతో మేలు  | Exercise Extends Life for People With Cancer, Study | Sakshi
Sakshi News home page

పేగు క్యాన్సర్‌ బాధితులకు వ్యాయామంతో మేలు 

Jun 2 2025 5:36 AM | Updated on Jun 2 2025 5:36 AM

Exercise Extends Life for People With Cancer, Study

పెరుగుతున్న జీవితకాలం తాజా అధ్యయనంలో వెల్లడి  

వాషింగ్టన్‌: నిత్యం వ్యాయామంతో పేగు క్యాన్సర్‌ బాధితులకు ఎంతో మేలు కలుగుతున్నట్లు తాజా అధ్యయనంతో తేలింది. కనీసం మూడేళ్లపాటు వ్యాయామం చేస్తే వారు వారు జీవించే అవకాశాలు చాలావరకు మెరుగవుతున్నట్లు వెల్లడయ్యింది. అంతేకాకుండా వ్యాయమం చేసేవారికి ఈ క్యాన్సర్‌ సోకే పరిస్థితి ఉండదని అంటున్నారు. పేగు క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నవారు కసరత్తులపై ఎక్కువగా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంగ్ల్లండ్, కెనడా, ఆ్రస్టేలియాలో ఈ అధ్యయనం నిర్వహించారు. 889 మంది బాధితులను పరిశీలించారు. 

వీరంతా పేగు క్యాన్సర్‌ బారినపడి కీమోథెరపీ చికిత్స పొందినవారే. సగం మందికి వ్యాయామాలు చేయాలని సూచించారు. తగిన పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. కానీ, వారు పెడచెవిన పెట్టారు. మిగిలిన సగం మందికి అధ్యయనకర్తలు కోచ్‌లను ఏర్పాటుచేశారు. కచ్చితంగా వ్యాయామాలు చేసేలా చర్యలు తీసుకున్నారు. నడక, ఈత వంటి ఎక్సర్‌సైజ్‌లతో శరీరాలను బాగా కదిలించినవారు చురుగ్గా మారడంతోపాటు పేగు క్యాన్సర్‌ ప్రభావం తగ్గిపోయినట్లు తేలింది. వ్యాయామం చేయనివారితో పోలిస్తే వీరి జీవితకాలం పెరిగినట్లు స్పష్టమయ్యింది.  ­

Advertisement
 
Advertisement
Advertisement