బ్రెజిల్‌ బదులు భారత్‌  | Donald Trump Appears To Confuse India And Brazil Election post | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌ బదులు భారత్‌ 

Oct 6 2026 5:47 AM | Updated on Oct 6 2026 5:47 AM

Donald Trump Appears To Confuse India And Brazil Election post

తప్పులో కాలేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ 

ఇండియా అధ్యక్ష ఎన్నికలంటూ పోస్టు 

అధ్యక్ష ఎన్నికలు జరిగింది బ్రెజిల్‌లో! 

గంటల తరువాత దిద్దుకున్న అధ్యక్షుడు

వాషింగ్టన్‌: బ్రెజిల్, భారత్‌... ప్రపంచానికి రెండు దిక్కుల్లో ఉండే దేశాలు. ఇరుగు పొరుగో లేక ఒకే ప్రాంతంలోని దేశాలైతే పొరపడవచ్చు కానీ... అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెరో మూల ఉండే బ్రెజిల్, భారత్‌లను మార్చేశారు. ట్రూత్‌ సోషల్‌లో ఒక పోస్టు చేస్తూ... బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికను ఇండియా అధ్యక్ష ఎన్నికగా పొరపాటున పేర్కొన్నారు. ‘‘ఇండియా అధ్యక్ష ఎన్నిక తొలి దశలో 12.5 కోట్ల మంది ఓటేశారు. 

ఓటింగ్‌ ముగిసిన వెంటనే అదే రోజు ఫలితాలు వెలువడ్డాయి,’’అని ట్రంప్‌ ఈ పోస్టులో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా... అమెరికాలో ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు చాలా ఎక్కువ సమయం పడుతూండటాన్ని ఉద్దేశిస్తూ... ‘‘అమెరికాలో ఓటింగ్‌ ‘‘అవినీతిమయం’’అని, ఫలితాలు వచ్చేందుకు వారాలు పడుతుందని విమర్శించారు. ట్రంప్‌ యథాలాపంగా చేసిన పొరబాటు ఇది. వాస్తవానికి.. ఆదివారం తొలిదశ ఎన్నికలు ముగిసింది బ్రెజిల్‌లో. దాదాపు 12.527 కోట్ల ఓట్లు పోల్‌ అయ్యాయి. 

సాయంత్రం ఐదు గంటలకు ఓటింగ్‌ ముగియగానే ఫలితాలు రావడమూ మొదలైంది. పైగా.. భారత్‌లో ప్రాతినిధ్య తరహా ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంటు సభ్యులతో ఏర్పడ్డ ఎలక్టోరల్‌ కాలేజీ అధ్యక్షుడిని (రాష్ట్రపతి) ఎన్నుకుంటుంది. ప్రస్తుత రాష్ట్రపతి 2022లో పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్‌ అమెరికా ఎన్నికల్లో మార్పులు తీసుకురావాలని చాలాకాలంగా యోచిస్తున్నారు. ముఖ్యంగా పోస్టల్‌ బ్యాలెట్లను నియంత్రించాలన్నది ఆయన లక్ష్యం. 

ఆగస్టులో ఆయన భారత్‌లోని ఓటర్‌ ఐడీ వ్యవస్థను ప్రస్తావిస్తూ అమెరికాలో ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని అభిలíÙంచారు ‘‘ఇండియా చివరి ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటేశారు! మెయిల్‌ ద్వారా ఓటేసిన వాళ్లు ఒక శాతం కంటే తక్కువ. ప్రతి ఓటర్‌కు ఫొటో ఐడీ తప్పనిసరి,’’అని ట్రంప్‌ కలవరించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టు పెట్టిన కొన్ని గంటల తరువాత ట్రంప్‌ తాను చేసిన పొరబాటును సరిదిద్దుకున్నారు. బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల తొలిదశలో అదే రోజున ఫలితాలు వెలువడ్డాయని చెప్పుకొచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement