గ్రేట్‌ ఎస్కేప్‌! | Border Patrol agents chase bicyclist in downtown Chicago | Sakshi
Sakshi News home page

గ్రేట్‌ ఎస్కేప్‌!

Sep 30 2025 5:33 AM | Updated on Sep 30 2025 5:33 AM

Border Patrol agents chase bicyclist in downtown Chicago

షికాగో: ఒక ఫుడ్‌ డెలివరీ వర్కర్‌ పరుగులు తీస్తుంటే.. దాదాపు పదిమంది ఇమ్మిగ్రేషన్‌ ఏజెంట్లు వెంబడించారు. ఈ దృశ్యం సోషల్‌ మీడియాలో వైరలై, అక్కడి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం పనితీరుపై పెద్ద రచ్చకు దారితీసింది.

అసలేం జరిగిందంటే..
షికాగో డౌన్‌టౌన్‌లో ఆదివారం ఒక ఫుడ్‌ డెలివరీ వర్కర్‌ను అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెంట్లు వెంటాడారు. ఈ ఉదంతాన్ని క్రిస్టోఫర్‌ స్వీట్‌ అనే వ్యక్తి వీడియో తీసి షేర్‌ చేశాడు. తన పోస్ట్‌లో ‘ఎక్స్‌క్లూజివ్‌ వార్త.. ఈరోజు ఒక వ్యక్తిని ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెంట్లు షికాగో డౌన్‌టౌన్‌లో వెంబడించారు.. అతను ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశాడు తప్ప భౌతిక దాడికి దిగలేదు.. బెదిరించలేదు కూడా.. ఏదైతేనేం మొత్తానికి తప్పించుకోగలిగాడు’.. అని వ్యాఖ్యానించారు.

నెటిజన్ల స్పందన
ఈ వీడియో ఆన్‌లైన్‌లో విపరీతంగా షేర్‌ అవు తోంది. చాలామంది నెటిజన్లు అతను  తప్పించుకున్న తీరును చూసి ‘బాగా పరుగెత్తాడు’ అంటూ మెచ్చుకుంటున్నారు. కొందరు ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెంట్ల దేహ దారుఢ్యం గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. స్వీట్‌.. ఏకంగా అమెరికన్‌ ఉన్నతాధికారులను ట్యాగ్‌ చేస్తూ, ఈ ఘటనను చిత్రీకరించడం ద్వారా తాను ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెంట్ల బండారం బయట పెట్టగలిగానని సరదాగా వ్యాఖ్యా నించాడు.

వెంటాడటం వెనుక కథేంటి?
ఆదివారం డౌన్‌టౌన్‌ షికాగోలో ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెంట్ల ఆపరేషన్లు జరిగాయని స్వీట్‌ వెల్లడించారు. అరెస్టులను ఇంకా అధికారికంగా ధ్రువీకరించకపోయినా, స్థానిక మీడియా మరిన్ని విషయాలు తెలిపింది. ‘ఆదివారం మధ్యాహ్నం పిల్లలతో సహా ఒక కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు’.. అని ఏబీసీ7షికాగో నివేదించింది. డబ్ల్యూబీఈజెడ్‌ సంస్థ.. ఒక సీనియర్‌ అమెరికా సరిహద్దు గస్తీ అధికారిని ఉటంకిస్తూ.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన అంగీకరించారని వెల్లడించింది. ఫుడ్‌ డెలివరీ వర్కర్‌ను వెంటాడటం, కేవలం రూపురేఖలు, ప్రవర్తన ఆధారంగా అరెస్టు చేసిన సంఘటన మొత్తం అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పద్ధతులపై తీవ్ర చర్చకు తెర లేపింది.! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement