breaking news
	
		
	
  Downtown
- 
      
                   
                                                       గ్రేట్ ఎస్కేప్!షికాగో: ఒక ఫుడ్ డెలివరీ వర్కర్ పరుగులు తీస్తుంటే.. దాదాపు పదిమంది ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు వెంబడించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరలై, అక్కడి ఎన్ఫోర్స్మెంట్ విభాగం పనితీరుపై పెద్ద రచ్చకు దారితీసింది.అసలేం జరిగిందంటే..షికాగో డౌన్టౌన్లో ఆదివారం ఒక ఫుడ్ డెలివరీ వర్కర్‌ను అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లు వెంటాడారు. ఈ ఉదంతాన్ని క్రిస్టోఫర్ స్వీట్ అనే వ్యక్తి వీడియో తీసి షేర్ చేశాడు. తన పోస్ట్‌లో ‘ఎక్స్‌క్లూజివ్ వార్త.. ఈరోజు ఒక వ్యక్తిని ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లు షికాగో డౌన్టౌన్లో వెంబడించారు.. అతను ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశాడు తప్ప భౌతిక దాడికి దిగలేదు.. బెదిరించలేదు కూడా.. ఏదైతేనేం మొత్తానికి తప్పించుకోగలిగాడు’.. అని వ్యాఖ్యానించారు.నెటిజన్ల స్పందనఈ వీడియో ఆన్లైన్లో విపరీతంగా షేర్ అవు తోంది. చాలామంది నెటిజన్లు అతను తప్పించుకున్న తీరును చూసి ‘బాగా పరుగెత్తాడు’ అంటూ మెచ్చుకుంటున్నారు. కొందరు ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ల దేహ దారుఢ్యం గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. స్వీట్.. ఏకంగా అమెరికన్ ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ, ఈ ఘటనను చిత్రీకరించడం ద్వారా తాను ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ల బండారం బయట పెట్టగలిగానని సరదాగా వ్యాఖ్యా నించాడు.వెంటాడటం వెనుక కథేంటి?ఆదివారం డౌన్‌టౌన్ షికాగోలో ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ల ఆపరేషన్లు జరిగాయని స్వీట్ వెల్లడించారు. అరెస్టులను ఇంకా అధికారికంగా ధ్రువీకరించకపోయినా, స్థానిక మీడియా మరిన్ని విషయాలు తెలిపింది. ‘ఆదివారం మధ్యాహ్నం పిల్లలతో సహా ఒక కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు’.. అని ఏబీసీ7షికాగో నివేదించింది. డబ్ల్యూబీఈజెడ్ సంస్థ.. ఒక సీనియర్ అమెరికా సరిహద్దు గస్తీ అధికారిని ఉటంకిస్తూ.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన అంగీకరించారని వెల్లడించింది. ఫుడ్ డెలివరీ వర్కర్‌ను వెంటాడటం, కేవలం రూపురేఖలు, ప్రవర్తన ఆధారంగా అరెస్టు చేసిన సంఘటన మొత్తం అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ పద్ధతులపై తీవ్ర చర్చకు తెర లేపింది.!
- 
  
      మళ్లీ జడివాన
- 
      
                   
                                 జాతీయ రహదారి దిగ్బంధం
 పూసపాటిరేగ : రెండు నెలలుగా పడుతున్న ఆకలి బాధలను తట్టుకోలేక పోయిన కార్మికులు రోడ్డెక్కారు. సమ్మెలో ఉన్న మండలంలోని ఎస్ఎంఎస్ కార్మికులు పూసపాటిరేగ జాతీయరహదారిని ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో దిగ్బంధించారు. దీంతో సుమారు 2గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండువైపులా 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు చేసిన నినాదాలతో మండల కేంద్రం దద్దరిల్లింది. ఏం జరుగుతోందో తెలియని విధంగా వాతావరణం గంభీరంగా మారింది. దీంతో సీఐ ఎ.ఎస్ చక్రవర్తి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో విసిగిపోయి ఉన్న ప్రయాణికులు రహదారిని దిగ్బంధించిన చోటకు చేరుకుని, సీఐ చక్రవర్తితో వాగ్వాదానికి దిగారు.
 
 చంటిపిల్లలతో ఉన్నవారు,ఫ్లైట్, ట్రైన్లకు వెళ్లేవారు సమయం దాటిపోతోంద ని వాగ్వాదానికి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు డౌన్‌డౌన్ అంటూ ప్రయాణికులు నినాదాలు చేశారు. రోగులతో ఉన్న అంబులెన్సులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆ తరువాత 12 గంటల సమయంలో సీఐ చక్రవర్తి.. కార్మికనాయకుడు తమ్మినేని సూర్యనారాయణతో చర్చలు జరిపి ట్రాఫిక్ పునరుద్ధరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ పరిశ్రమ యాజమాన్యం వహిస్తున్న నిరంకుశ ధోరణి వల్ల అంతా ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. 50 రోజులుగా ఆకలి మంటలతో కార్మికులు అల్లాడుతున్నారని, అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సూర్యనారాయణ, రమణతో పాటు అధికసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.


