Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో స్వల్ప ‍వ్యవధిలో రెండు భూకంపాలు | Afghanistan Hit Earthquake of Magnitude 4 3 4 7 Strikes | Sakshi
Sakshi News home page

Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో స్వల్ప ‍వ్యవధిలో రెండు భూకంపాలు

Mar 29 2025 7:45 AM | Updated on Mar 29 2025 7:51 AM

Afghanistan Hit Earthquake of Magnitude 4 3 4 7 Strikes

కాబూల్‌: మయన్మార్‌లో సంభవించిన భూకంపం గురించి మరువకముందే ఆఫ్ఘనిస్థాన్‌(Afghanistan)లో స్వల్ప వ్యవధిలో రెండుమార్లు భూకంపం సంభవించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. నిముషాల వ్యవధిలో భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. 
 

ఆఫ్ఘనిస్థాన్‌లో ఈరోజు (శనివారం, మార్చి 29) ఉదయం సంభవించిన భూప్రకంననలు(Earthquakes) ప్రజలను వణికింపజేశాయి. స్వల్ప వ్యవధిలో ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన రెండు ప్రకంపనల  తీవ్రత వరుసగా 4.7, 4.3 గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4:51.. 5:16 గంటలకు ఈ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం కారణంగా జనం తమ ఇళ్లనుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతానికి ఈ భూకంపాల వలన ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు లేవు. మార్చి 28న మయన్మార్, థాయిలాండ్‌లలో బలమైన ప్రకంపనలు సంభవించినప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌లోనూ భూకంపం సంభవించింది.

భూకంపశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 4.3, 4.7 తీవ్రతతో వచ్చే భూకంపాలను మోడరేట్ భూకంపాలుగా వర్గీకరిస్తారు. ఇటువంటివి బలహీనమైన నిర్మాణాలు ఉన్న ప్రదేశాలలో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.  కాగా మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) నివేదిక ప్రకారం దీని కేంద్రం భూమికి 160 కి.మీ. దిగువన ఉంది. మార్చి 13న కూడా ఆఫ్ఘనిస్థాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రత నమోదయ్యింది.

ఇది కూడా చదవండి: Earthquake: మయన్మార్‌లో మళ్లీ భూ ‍ప్రకంపనలు.. జనం పరుగులు
 

Advertisement
 
Advertisement
Advertisement