ల్యాండవుతున్న విమానంలో మంటలు | Aeroplane Catches Flames In california | Sakshi
Sakshi News home page

USA: ల్యాండవుతున్న విమానంలో మంటలు

Oct 6 2024 11:38 AM | Updated on Oct 6 2024 12:06 PM

Aeroplane Catches Flames In california

కాలిఫోర్నియా: ప్రయాణికులతో వెళుతున్న ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగో నుంచి లాస్‌ వెగాస్‍కు వచ్చిన ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో దట్టమైన పొగ వ్యాపించింది.

విమానం లాస్‌వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. 

విమానంలో మంటలు రావడంతో వెంటనే స్పందించిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది ఫైర్‌ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు.మంటలు ఎగిసిపడ్డ సమయంలో విమానంలో మొత్తం 190 మంది ప్రయాణికులు,ఏడుగురు సిబ్బంది ఉన్నారు.వారందరినీ సురక్షితంగా విమానం నుంచి బయటికి తీసుకువచ్చారు.

ఇదీ చదవండి: యుద్ధం వస్తే.. ఏ దేశం పవర్‌ ఎంత..?

 

Advertisement
 
Advertisement
Advertisement