అక్కడ ఏడాదికి 25,000 రోజులు | 25000-Year Orbit, Meet the Newest Solar System Member | Sakshi
Sakshi News home page

అక్కడ ఏడాదికి 25,000 రోజులు

Jun 3 2025 4:40 AM | Updated on Jun 3 2025 4:40 AM

25000-Year Orbit, Meet the Newest Solar System Member

వాషింగ్టన్‌: భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగిరావడానికి 365 రోజులు పడుతుందని తెల్సిందే. అదే మాదిరి ఒక చిన్నపాటి మరుగుజ్జు గ్రహం లాంటి ఖగోళ వస్తువు మన సూర్యుని చుట్టూ అత్యంత నెమ్మదిగా తిరుగుతోంది. ఎంతగా అంటే ఒక చుట్టు చుట్టేయడానికి ఏకంగా 25,000 రోజుల సమయం తీసుకుంటోంది. సౌరమండలంలో కొత్తగా కనిపెట్టిన ఈ మరుగుజ్జు గ్రహానికి 2017 ఓఎఫ్‌201 అని పేరుపెట్టారు. అయితే దీనిని గ్రహం హోదా ఇవ్వాలా వద్దా అనే చర్చ జరుగుతోంది. 

ఎందుకంటే దీనిని పూర్తిస్థాయిలో గ్రహ లక్షణాలు లేవని తేలింది. నెప్ట్యూన్‌ గ్రహం ఎంత దూరంలో అయితే సూర్యుడి చుట్టూ తిరుగుతోందో అంతకంటే కాస్తంత ఎక్కువ దూరంలో ఈ అంతరిక్ష పదార్థం మన సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఇది చాలా నెమ్మదిగా పరిభ్రమిస్తోంది. ఒకసారి సూర్యుడిని చుట్టిరావడానికి 25,000 రోజుల సమయం తీసుకుంటోంది. దీని వెడల్పు ఏకంగా 700 కిలోమీటర్లు. ‘‘ కోట్ల సంవత్సరాలుగా ఒకే కక్షలో పరిభ్రమిస్తోంది.

 ఆ లెక్కన చూస్తే బుల్లి గ్రహం హోదా పొందే అర్హత కాస్తంత దీనికి ఉంది’’ అని అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే ప్రిన్స్‌టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీలో ఖగోళ భౌతిక శాస్తవేత్త సిహావో చెంగ్‌ అన్నారు. మరుగుజ్జు గ్రహాల హోదా పొందిన ఐదింటిక కంటే ఈ కొత్త ఖగోళ వస్తువు కాస్తంత చిన్నగా ఉంది. గతంలో గ్రహంగా చెలామణి అయిన ఇటీవల మరుగుజ్జు గ్రహంగా స్థిరపడిపోయిన ప్లూటో వ్యాసం 2,377 కిలోమీటర్లుకాగా ఈ 2017 ఓఎఫ్‌201 వ్యాసం కేవలం 700 కిలోమీటర్లే!
 

Advertisement
 
Advertisement
Advertisement