1,600 కోట్ల పాస్‌వర్డ్‌లు చోరీ! | 16 billion passwords allegedly leaked in massive data | Sakshi
Sakshi News home page

1,600 కోట్ల పాస్‌వర్డ్‌లు చోరీ!

Jun 21 2025 4:25 AM | Updated on Jun 21 2025 4:25 AM

16 billion passwords allegedly leaked in massive data

వాషింగ్టన్‌: నేటి ఇంటర్నెట్‌ యుగంలో డేటా లీకేజీ సర్వసాధారణంగా మారిపోయింది. నెటిజన్ల గోప్య తకు భంగం కలుగుతోంది. వారి వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు సైబర్‌ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అతిపెద్ద డేటా లీకేజీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలోనే 1,600 కోట్ల పాస్‌వర్డ్‌లు లీౖకైనట్లు సైబర్‌న్యూస్, ఫోర్బ్స్‌ సంస్థలు వెల్లడించాయి. 

ఇది ఇంటర్నెట్‌ చరిత్రలో అతిపెద్ద డేటా లీకేజీ ఘటన అని తెలియజేశాయి. ఆపిల్, ఫేస్‌బుక్, గూగుల్, టెలిగ్రామ్‌తోపాటు ప్రభుత్వ వెబ్‌సైట్ల యూజర్ల లాగిన్‌ వివరాలు హ్యాకర్ల చేతికి చేరినట్లు పేర్కొన్నాయి. అంతేకాకుండా సోషల్‌ మీడియా వేదికలు ఉపయోగించేవారి వివరాలు సైతం బయటకు లీౖకైనట్లు వెల్లడించాయి. 

రహస్యంగా ఉండాల్సిన పాస్‌వర్డ్‌లు పరులు చేతికి చేరుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఫిషింగ్‌ స్కామ్‌లు, అకౌంట్‌ హ్యాకింగ్‌ వంటివి పెరుగుతున్నాయని నిపుణులు చెబుతు న్నారు. 

సైబర్‌ నేరగాళ్లు ఇన్ఫోస్టీలర్స్‌ అని పిలిచే మాల్‌ వేర్‌ను కంప్యూటర్లు, ఫోన్లలోకి పంపించి పాస్‌వర్డ్‌లు చోరీ చేస్తున్నారని చెప్పారు. డేటా లీకేజీ వెనుక అంతర్జాతీయ ముఠాల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ముఠాలు వ్యవస్థీకృతంగా పనిచేస్తూ వ్యక్తుల రహస్య సమాచారాన్ని కొల్లగొట్టి, వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement