breaking news
leaked email
-
1,600 కోట్ల పాస్వర్డ్లు చోరీ!
వాషింగ్టన్: నేటి ఇంటర్నెట్ యుగంలో డేటా లీకేజీ సర్వసాధారణంగా మారిపోయింది. నెటిజన్ల గోప్య తకు భంగం కలుగుతోంది. వారి వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు సైబర్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అతిపెద్ద డేటా లీకేజీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలోనే 1,600 కోట్ల పాస్వర్డ్లు లీౖకైనట్లు సైబర్‌న్యూస్, ఫోర్బ్స్ సంస్థలు వెల్లడించాయి. ఇది ఇంటర్నెట్ చరిత్రలో అతిపెద్ద డేటా లీకేజీ ఘటన అని తెలియజేశాయి. ఆపిల్, ఫేస్బుక్, గూగుల్, టెలిగ్రామ్‌తోపాటు ప్రభుత్వ వెబ్సైట్ల యూజర్ల లాగిన్ వివరాలు హ్యాకర్ల చేతికి చేరినట్లు పేర్కొన్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికలు ఉపయోగించేవారి వివరాలు సైతం బయటకు లీౖకైనట్లు వెల్లడించాయి. రహస్యంగా ఉండాల్సిన పాస్వర్డ్లు పరులు చేతికి చేరుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఫిషింగ్ స్కామ్‌లు, అకౌంట్ హ్యాకింగ్ వంటివి పెరుగుతున్నాయని నిపుణులు చెబుతు న్నారు. సైబర్ నేరగాళ్లు ఇన్ఫోస్టీలర్స్ అని పిలిచే మాల్ వేర్‌ను కంప్యూటర్లు, ఫోన్లలోకి పంపించి పాస్వర్డ్లు చోరీ చేస్తున్నారని చెప్పారు. డేటా లీకేజీ వెనుక అంతర్జాతీయ ముఠాల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ముఠాలు వ్యవస్థీకృతంగా పనిచేస్తూ వ్యక్తుల రహస్య సమాచారాన్ని కొల్లగొట్టి, వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. -
హిల్లరీ.. అమితాబ్‌ను కలిశారా?
మరో మూడు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో సరికొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్.. కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను కలిసినట్లు తాజాగా లీకైన ఈ మెయిల్ ద్వారా తెలుస్తోంది. ద వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు చెందిన పొలిటికల్ రిపోర్టర్ జోస్ ఎ డెల్రియల్ దీనికి సంబంధించి ఒక ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పాకిస్థాన్ సంతతికి చెందిన తన సహాయకురాలు హుమా అబెదిన్‌ను ఆమె అడిగారు. 2011 జూలైలో రాసిన ఈ మెయిల్ తాజాగా బయటపడింది. ''కొన్నేళ్ల క్రితం మనం కలిసిన భారతీయ వృద్ధ నటుడి పేరేంటి'' అని ఆమె ఒక ఈ మెయిల్లో ప్రశ్నించగా, దానికి అబెదిన్.. ''అమితాబ్ బచ్చన్'' అని సమాధానమిచ్చారు. అయితే ఏ సందర్భంలో అమితాబ్‌ను వాళ్లు కలిశారన్న విషయం గురించిన చర్చ మాత్రం ఆ ఈమెయిల్లో లేదు. సరిగ్గా ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలోనే ఈమెయిల్స్ బయటపడటం హిల్లరీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఈమెయిల్స్ విషయంలో దర్యాప్తు చేయనున్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ కాంగ్రెస్‌కు ఒక లేఖ రాశారు. హుబా అబెదిన్ మాజీ భర్తకు చెందిన ఒక ల్యాప్‌టాప్‌ను ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుని, దాన్నుంచి మొత్తం 6.50 లక్షల ఈమెయిల్స్‌ను రిట్రీవ్ చేసింది. బరాక్ ఒబామా తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు ఆయన మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన హిల్లరీ.. ప్రైవేటు ఈ మెయిల్ సర్వర్‌ను ఉపయోగించడంపై దర్యాప్తు జరగనుంది. -
మెగాస్టార్ గురించి హిల్లరీ ఆరా?
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌కు సంబంధించి లీకేజీ మెయిల్ వివరాలను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. హిల్లరీ తన సన్నిహితురాలు, పాకిస్థాన్ సంతతికి చెందిన హ్యూమా అబెదిన్కు పంపిన మెయిల్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన ప్రస్తావన ఉంది. ‘కొన్నేళ్ల క్రితం మనం ప్రఖ్యాత భారతీయ సీనియర్ నటుడ్ని కలిశాం. ఆయన పేరు ఏమిటి?’ అంటూ హిల్లరీ చేసిన మెయిల్లో అబెదిన్‌ను ప్రశ్నించారు. ఆమె బదులిస్తూ ‘అమితాబ్ బచ్చన్’ అంటూ సమాధానమిచ్చారు. హిల్లరీ అమితాబ్ గురించి ఎందుకు అడిగారు? ఇందుకు గల కారణం ఏంటి అన్న విషయాలు మెయిల్లో ప్రస్తావించలేదు. 2011 జూలైలో హిల్లరీ ఈ మెయిల్ పంపారు. మెయిల్స్ లీకేజీ వ్యవహారం హిల్లరీకి తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఎఫ్‌బీఐ విచారణ చేస్తోంది.