జనావాసాల్లోకి సింహం.. ఫ్రెండ్‌ కళ్లముందే యువతి ప్రాణం తీసింది! | 14 Year-Old Girl Attacked By Lion In Front Of Friend Nairobi | Sakshi
Sakshi News home page

జనావాసాల్లోకి సింహం.. ఫ్రెండ్‌ కళ్లముందే యువతి ప్రాణం తీసింది!

Apr 21 2025 8:34 PM | Updated on Apr 21 2025 9:08 PM

14 Year-Old Girl Attacked By Lion In Front Of Friend Nairobi

నైరోబీ:   కెన్యా రాజధాని నైరోబీలో ఒక సింహం జనావాసాల్లోకి వచ్చి  దాడి చేసిన ఘటనలో యువతి ప్రాణం కోల్పోయింది.  నేషనల్ జూ పార్క్ నుంచి తప్పించుకు వచ్చిన ఆ సింహం.. జనావాసాల్లోకి వచ్చింది. అయితే దీన్ని గమనించని ఇద్దరు యువతులు వస్తున్న సమయంలో సింహం అమాంతం దాడి చేసింది. ఇందులో ఒక యువతిపై పంజా విసిరి అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లిపోయింది. 

దీనిపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. చివరకు యువతి మృతదేహాన్ని మాత్రమే కనుగొన్నారు. ఆమె వెనుక భాగంలో తీవ్ర గాయాల పాలైన ఆ యువతి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జనావాసాలు ఉండే ప్రాంతానికి నైరోబీ నేషనల్ పార్క్ కేవలం 10 కి.మీ దూరంలోనే ఉంది. అక్కడ నుంచి తప్పించుకుని ఉంటుందని భావిస్తున్న సింహం.. ఇలా దాడి చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురౌవుతున్నారు. ఆ నేషనల్ పార్క్  అనేది క్రూర మృగాలకు ఆవాసం. సింహాలు, పులులు, చిరుత పులులు తదితర జంతువులు ఉంటాయి. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement