
సిగరెట్లు అమ్మడం లేదన్నందుకు..
మేడ్చల్‌రూరల్: సిగరెట్లు అమ్మడం లేదని చెప్పినందుకు హోటల్‌లో పని చేసి వ్యక్తితో పాటు యజమాని, అతడి కుమారుడు, కుమార్తైపె దాడి చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక వినాయక్‌నగర్ కాలనీకి చెందిన రాజేశ్ చతుర్వేది సోమారం గ్రామ పరిధిలోని రిలాన్స్ గోదాం సమీపంలో హోటల్ నిర్వహిస్తున్నాడు. సదరు హోటల్‌లో దివాకర్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. గత నెల 30న రాత్రి సమీపంలోని బండమైలారం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు హోటల్‌కు వచ్చి సిగరెట్లు కావాలని అడిగారు. సిగరెట్లు అమ్మడం లేదని దివాకర్ చెప్పడంతో ఆగ్రహానికి లోనైన వారు అతడిపై దాడి చేశారు. దీనిపై అతను యజమాని రాజేశ్ చతుర్వేదికి సమాచారం అందించడంతో అతను తన కుమార్తె శివానీ, కుమారుడు కృష్ణతో కలిసి హోటల్ వద్దకు వచ్చి వారికి సర్దిచెప్పి పంపించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అక్కడికి వచ్చిన 20 మంది యువకులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రాజేశ్ చతుర్వేదితో పాటు అతడి కుమార్తె, కుమారుడికి గాయాలయ్యాయి. అడ్డుగా వచ్చిన రాకేశ్ చతుర్వేది అనే వ్యక్తిపై కూడా వారు దాడి చేశారు. ఈ విషయం ఎవరికై నా చెపితే చంపుతానని బెదిరించారు. ఈ విషయమై బాధితులు మర్నాడు మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హోటల్ నిర్వాహకులపై దాడి