
కీసరగుట్ట ఆలయ హుండీ లెక్కింపు
కీసర: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి దేవస్థానానికి రూ.92,49,961 ఆదాయం సమకూరింది. ప్రసాదాలు, వివిధ ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాల టికెట్ల విక్రయం ద్వారా రూ.63,51,060 ఆదాయం రాగా, హుండీ ఆదాయం రూ.28,98,901 వచ్చిందని, ఆలయ చైర్మన్ తటాకం నారాయణ, ఈవో సుధాకర్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం దేవాలయం మహామండపంలో హుండీని లెక్కించారు. ఈ ఆదాయాన్ని స్వామిపేరిట కీసర ఎస్‌బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు వారు తెలిపారు. గతేడాది బ్రహ్మోత్సవాల కంటే ఈసారి సుమారు రూ.14,70,436ల మేర ఆదాయం పెరిగిందన్నారు. ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులు, ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.