గ్రీన్‌ సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ సిగ్నల్‌

Mar 2 2025 6:39 AM | Updated on Mar 2 2025 6:51 AM

గ్రీన్‌ సిగ్నల్‌

గ్రీన్‌ సిగ్నల్‌

‘ట్రాఫిక్‌’ సమస్యల పరిష్కారమే బల్దియా ధ్యేయం

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ నగరంలో అసలే ట్రాఫిక్‌ సమస్యలెక్కువ. దానికి తోడు పలు జంక్షన్లలో ట్రాఫిక్‌ సిగ్నళ్లు లేవు. ఉన్న సిగ్నళ్లలోనూ పని చేయనివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో పని చేయని ట్రాఫిక్‌ సిగ్నళ్లకు అవసరమైన మరమ్మతులు చేసేందుకు, లేని ప్రాంతాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు, నిర్వహణ మెరుగ్గా ఉండేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ఇందుకోసం కొత్తగా ఏర్పాటు చేసేవాటి కోసం సిగ్నళ్ల డిజైన్‌, సప్లయ్‌, ఇన్‌స్టలేషన్‌, పాత సిగ్నళ్లకు మరమ్మతులు, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కోసం తక్కువ ధరకు ఆయా పరికరాలు, ఉపకరణాలు సప్లయ్‌ చేసే ఏజెన్సీల నుంచి కొటేషన్లను ఆహ్వానించింది.

జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం 404 జంక్షన్లలో ట్రాఫిక్‌ సిగ్నళ్లున్నాయి. దశాబ్దం క్రితం ఏర్పాటు చేసిన జంక్షన్లలో సరిగా పని చేయనివెన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైన జంక్షన్లను అప్‌గ్రేడ్‌ చేయాలని, సిగ్నలింగ్‌ విధానాన్ని ఆధునికీకరించాలని అధికారులు భావిస్తున్నారు. నిర్వహణ (ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) మొత్తం సమగ్రంగా కొత్తగా కాంట్రాక్టుకు ఇవ్వాలని.. తద్వారా వాహనాల ప్రయాణం మెరుగవడం, వేగం పెరగడం, పాదచారులకు భద్రత కల్పించడంతో పాటు ఎమర్జెన్సీ వాహనాలకు ప్రాధాన్యమివ్వాలనుకుంటున్నారు. మూడేళ్ల వరకు ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌తో పాటు టైమర్స్‌ తదితర అంశాల వారీగా అవసరమైన సామగ్రికి కొటేషన్లు ఆహ్వానించారు. వాటిని పరిశీలించాక, పరికరాల సరఫరా, నిర్వహణల కోసం టెండర్లు జారీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతమున్న ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంక్షన్లు..

పని చేస్తున్న సిస్టమ్స్‌ పోలీస్‌ కమిషనరేట్ల వారీగా..

హెచ్‌–ట్రిమ్స్‌ : హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ఇంటిగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌

ఏటీఎస్‌సీ: అడాప్టివ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ కంట్రోల్‌ సిస్టమ్‌

పీఎస్‌ఎస్‌: పెలికాన్‌ సిగ్నల్‌ సిస్టమ్‌

పని చేయని సిగ్నళ్లకు మరమ్మతులు

కొత్తవాటి ఏర్పాటు దిశగా జీహెచ్‌ఎంసీ చర్యలు

సిస్టమ్‌ హైదరాబాద్‌ సైబరాబాద్‌ రాచకొండ

హెచ్‌–ట్రిమ్స్‌ 133 60 20

ఏటీఎస్‌సీ 62 38 13

పీఎస్‌ఎస్‌ 31 44 3

మొత్తం 226 142 36

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement