
సాక్షి, సిటీబ్యూరో: రాంగ్ సైడ్ డ్రైవింగ్, అస్పష్ట నంబరు ప్లేట్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై సిటీ పోలీసులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ఈ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్‌తో ఒకరు మృతి చెందారు.
21 మంది గాయాల పాలయ్యారు. గత ఏడాది ఏకంగా ముగ్గురు మరణించగా.. 206 మంది క్షతగాత్రులయ్యారు. అస్పష్ట నంబరు ప్లేట్ వాహనదారులకు రూ.200 జరిమానాతో పాటు చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.