బండ్లగూడ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం.? | Sakshi
Sakshi News home page

బండ్లగూడ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం.?

Published Sat, Jan 13 2024 5:56 AM

- - Sakshi

బండ్లగూడ: బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ మేయర్‌ బుర్ర మహేందర్‌గౌడ్‌పై అవిశ్వాస తీర్మానం కోసం ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. అవిశ్వాసానికి పట్టుపడుతున్న వారిలో బీఆర్‌ఎస్‌కు చెందిన కార్పొరేటర్లు 13 మందితో పాటు ఇద్దరు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు, ఒక బీజేపీ కార్పొరేటర్‌ ఉన్నారు. వీరందరూ శుక్రవారం డిప్యూటీ మేయర్‌ పూలపల్లి రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంకను కలిసి ఫిర్యాదు చేశారు.

కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉండగా అందులో 16 మంది అవిశ్వాస తీర్మానం కోరుకుంటున్నారు. అధిక శాతం సభ్యులు మేయర్‌ పాలన నచ్చడం లేదని నిర్మొహమాటంగా స్పష్టం చేస్తున్నారు. గతంలోనూ పలుమార్లు కార్పొరేటర్లు బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌ గౌడ్‌ జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పడంతో అప్పట్లో వివాదం సర్దుమణిగింది.

అవిశ్వాస తీర్మానం కోరుకుంటుంది వీరే..
బండ్లగూడ జాగీరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ మహేందర్‌గౌడ్‌పై ఫిర్యాదు చేసిన వారిలో డిప్యూటీ మేయర్‌ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు తలారీ చంద్రశేఖర్‌, మాలతీనాగరాజు, సంతోషిరాజిరెడ్డి, లతాప్రేమ్‌గౌడ్‌, శ్రావంతినరేందర్‌, అనితవెంకటేష్‌, అస్లాంబిన్‌ అబ్దుల్లా, శ్రీనాథ్‌రెడ్డి, భూపాల్‌గౌడ్‌, రవీందర్‌రెడ్డి, నిఖిలసంగారెడ్డి, ఆసియాఖాజా, ముద్దం రాము, ప్రశాంత్‌నాయక్‌, పుష్పమ్మ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement