భారీగా హెరాయిన్‌ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

భారీగా హెరాయిన్‌ పట్టివేత

Nov 11 2023 4:28 AM | Updated on Nov 11 2023 4:28 AM

- - Sakshi

నాగోలు: రాజస్థాన్‌ నుంచి అక్రమంగా హెరాయిన్‌ తీసుకువచ్చి నగరంలో సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను నాగోలు పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ. 50 లక్షల విలువైన 70 గ్రాముల హెరాయిన్‌, రూ.1, 570 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన ట్యాంక్‌ పంకజ్‌ భాయ్‌ నగరంలోని అంబర్‌పేటలో నివాసం ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. రాజస్థాన్‌కు చెందిన ప్రజాపతి ముఖేష్‌ లక్ష్మణ్‌ జీ బాయ్‌ ఆలియస్‌ ముఖేష్‌ ప్రజపతి నగరంలోని అంబర్‌పేటలో నివాసం ఉంటూ మొబైల్‌ షాప్‌లో పనిచేస్తున్నాడు. వారిరువు బంధువులు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వీరు దేశంలోని వివిధ ప్రాంతాలను నుంచి వాటిని సేకరించి వినియోగించేవారు. ఈ నేపథ్యంలో తాము వినియోగించడమేగాక ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా వారు రాజస్థాన్‌కు వెళ్లి అక్కడ హెరాయిన్‌ సరఫరాదారుడిని సంప్రదించారు. అక్కడి నుంచి హెరాయిన్‌ తీసుకువచ్చి నగరంలో అవసరమైన వారికి విక్రయించేవారు. శుక్రవారం మధ్యాహ్నం వారు హెరాయిన్‌ సరఫరా చేసేందుకు వెళుతుండగా సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు, నాగోలు పోలీసులతో కలిసి నాగోలు చౌరస్తాలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 70 గ్రాముల హెరాయిన్‌, నగదు, సెల్‌ఫోన్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇద్దరు నిందితుల అరెస్టు..

రూ.50 లక్షల విలువైన సరుకు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement