బంజారాహిల్స్‌.. స్పా ముసుగులో వ్యభిచార ముఠా గుట్టురట్టు... | - | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌.. స్పా ముసుగులో వ్యభిచార ముఠా గుట్టురట్టు...

Jul 4 2023 7:12 AM | Updated on Jul 4 2023 7:18 AM

- - Sakshi

హైదరాబాద్: మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని రువాన్‌ థాయ్‌ స్పాపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. వివరాలివీ... రోడ్‌ నెం. 12లోని రువాన్‌ థాయ్‌ స్పాలో థాయ్‌లాండ్‌కు చెందిన నన్ని, సుజి, హనా, అవా, ఆప్లే మసాజ్‌ థెరపిస్టులుగా పని చేస్తున్నారు. స్పా యజమాని సల్మాన్‌, ఖాలీద్‌ అనే వ్యక్తులు వీరిని సెక్స్‌ వర్కర్లుగా మార్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి సదరు స్పాపై దాడులు నిర్వహించారు.

నిర్వాహకుడు సల్మాన్‌ పరారు కాగా, ఖాలీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రసూన్‌ ప్రకాష్‌ అనే వ్యక్తి కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతులను పునరావాస కేంద్రానికి తరలించిన పోలీసులు నిర్వాహకులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పది మంది విటులకు నోటీసులు జారీ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement