ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు | - | Sakshi
Sakshi News home page

ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు

Jun 10 2023 8:14 AM | Updated on Jun 10 2023 8:35 AM

- - Sakshi

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఉర్దూకు ప్రాధాన్యం ఇవ్వలేదని, ఎక్కడ ఉర్దూ పోస్టర్లు, ప్రకటనలు లేవని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. గురువారం రాత్రి అల్లాపూర్‌లో నిర్వహించిన గెల్సా యాదే పక్రే మిలాత్‌ మౌలానా అబ్ధుల్‌ ఓవైసీ సంస్మరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్సిటీలు, పెద్ద విద్యా సంస్థల్లో ముస్లింలకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించారు. కారు స్టీరింగ్‌ తమ చేతిలో ఉందనే వాళ్లు దీనిని గమనించాలని సూచించారు. ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ప్రజల ఆదరణతో తామే మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కొందరు నాయకులు విధ్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. అనంతరం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ఆరుగురు విద్యార్థులకు పతకాలు, మెమొంటోలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement