దుండిగల్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు బీటెక్‌ విద్యార్ధులు మృతి | Road Accident In Dundigal,three Students Dead | Sakshi
Sakshi News home page

దుండిగల్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు బీటెక్‌ విద్యార్ధులు మృతి

Jul 19 2024 9:03 PM | Updated on Jul 19 2024 9:11 PM

Road Accident In Dundigal,three Students Dead

సాక్షి,హైదరాబాద్‌: మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని స్కోడా కారు ఢీకొట్టడంతో వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌ జ్యోతికి చెందిన ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థులు అక్షయ్, హరి, అస్మిత్ గా గుర్తించారు. 

దుండిగల్‌ నుంచి కుత్బుల్లాపూర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, అతివేగం వల్లే విద్యార్ధులు మరణించినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదంపై స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  

Advertisement
 
Advertisement
Advertisement