శాకాంబరి దేవిగా శ్రీ వారాహి సహిత శ్రీ చాముండేశ్వరి మాత | Sri Varahi Sahita Sri Chamundeshwari Devi Decorated as Sri Shakambhari Devi | Sakshi
Sakshi News home page

శాకాంబరి దేవిగా శ్రీ వారాహి సహిత శ్రీ చాముండేశ్వరి మాత

Jul 30 2026 8:48 AM | Updated on Jul 30 2026 8:54 AM

Sri Varahi Sahita Sri Chamundeshwari Devi Decorated as Sri Shakambhari Devi

హైదరాబాద్‌: ఆషాడ మాసం గురుపూర్ణిమ సందర్భంగా శ్రీనగర్‌ కాలనీలోని శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో శ్రీ వారాహి సహిత శ్రీ చాముండేశ్వరి మాత శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతి పరమ పూజ్య గురూజి బ్రహ్మశ్రీ శ్రీ కృష్ణ చాముండేశ్వర మహర్షి తెలిపారు. 

వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా అమ్మవారు బుధవారం శాకంబరి దేవిగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వారాహి గుప్త నవరాత్రి అనుష్టాన ఫలితంగా ఒక దివ్య దర్శనం కందలో వారాహి దంతాలతో కూడిన మొలకలు దర్శించడం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించక మానదని ఆయన అన్నారు. 

భక్తులు పీఠానికి వచ్చి కందలో ఉన్న వారాహి అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. వారాహి అమ్మవారి దంతాలను పోలినట్లుగా ఉండటం నిజంగా ఒక మహిమాన్వితమైనటువంటి సందర్భంగా అనుభూతిని  కలిగిస్తుందని ఆయన అన్నారు. నేపాల్‌లోని హిమాలయ గండకీ నదీ తీరంలో దర్శించి తీసుకువచ్చిన అపురూప సాలగ్రమ రాజమే వారాహి సాలగ్రమం రూపంలో ఉంటుందని బంగారు లింగ సహితంగా ఉన్నటువంటి ఈ సెలలో ప్రత్యేక గుణాలు ఉన్నాయని దీన్ని దర్శించుకుంటే భక్తులకు ఎంతో మంచి జరుగుతుందని స్వామీజి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement