సమయం లేదు సర్‌ | - | Sakshi
Sakshi News home page

సమయం లేదు సర్‌

Jul 13 2026 4:31 AM | Updated on Jul 13 2026 4:31 AM

సమయం లేదు సర్‌

వేగవంతంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ..

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ప్రత్యేక ఓటరు జాబితా (ఎస్‌ఐఆర్‌) సవరణ ప్రక్రియ ముగియడానికి ఇంకా 11 రోజులే గడువు ఉండగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో డిజిటలైజేషన్‌ పనులు ఆశించిన వేగంతో సాగడం లేదు. ఇంటింటికీ వెళ్లి ఫారాల పంపిణీ దాదాపు పూర్తయ్యింది. వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ మాత్రం ఇంకా సగానికి కూడా చేరుకోలేదు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం నిత్యం కాన్ఫరెన్స్‌ల ద్వారా అలర్ట్‌ చేస్తోంది. జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులు నిత్యం ఫాలోఅప్‌ చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి 8.01 గంటలకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉమ్మడి ఆరు జిల్లాల్లో కలిపి 45.57 శాతం ఫారాలే డిజిటలైజ్‌ అయ్యాయి.

ఫారాల పంపిణీలో భేష్‌..

జూన్‌ 25న మొదలైన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, బీఎల్‌ఓల ఇంటింటి సందర్శన, పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్‌ ఈ నెల 24న ముగియనుంది. వీటికి ఇంకా 11 రోజులే సమయం ఉండగా, 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ చేయాల్సి ఉంది. మొత్తం 30,53,238 మంది ఓటర్లకు సంబంధించి 30,53,231 ఫారాలు (100 శాతం) పంపిణీ చేశారు. అయితే, వాటిలో 13,91,440 (45.57 శాతం) ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్‌ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన లక్షలాది ఫారాలను గడువులోగా నమోదు చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. విద్యావంతులు, పట్టణ ఓటర్లు అధికంగా ఉన్న హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లోనే నింపిన ఫారాల అందజేత, డిజిటలైజేషన్‌ వేగం మందగించింది. హనుమకొండలో 42.97 శాతం, వరంగల్‌లో 40.39 శాతం , మహబూబాబాద్‌లోనూ 42.62 శాతం మాత్రమే పూర్తయ్యింది.

53.66 శాతంతో ముందంజలో ములుగు..

ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా డిజిటలైజేషన్‌ ప్రక్రియ మొత్తంగా చూస్తే 50 శాతం దాటలేదు. ఇక గిరిజన, అటవీ ప్రాంతాలు అధికంగా ఉన్న ములుగు జిల్లా మాత్రం 53.66 శాతంతో ఉమ్మడి జిల్లాలో ముందంజలో నిలిచింది. జయశంకర్‌ భూపాలపల్లి (50.36 శాతం), జనగామ (50.18 శాతం) జిల్లాలు కూడా కొంత మెరుగైన పురోగతి నమోదు చేశాయి. ఫారాల పంపిణీ దాదాపు పూర్తి కావడంతో ఇప్పుడు అధికారుల దృష్టి డిజిటలైజేషన్‌పైనే ఉంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో ఫారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ‘సర్‌’ డిజిటలైజేషన్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు ముమ్మరం చేసిన అధికారులు సోమవారం నుంచి వేగం పెరుగుతుందని, ఇన్‌టైంలో డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు.

మొత్తం ఓటర్లు ఫారాల పంపిణీ

పంపిణీ శాతం డిజిటలైజేషన్‌

డిజిటలైజేషన్‌ శాతం

100%

50.18%

40.39%

42.97%

4,84,932

42.62%

5,09,014

7,67,483

3,85,152

2,77,882

7,67,484

4,84,935

50.36%

7,76,953

53.66%

2,36,970

3,13,806

2,18,699

2,77,879

2,06,661

1,39,955

1,27,167

జేఎస్‌భూపాలపల్లి

జనగామ

హనుమకొండ

ములుగు

వరంగల్‌

ఎన్యూమరేషన్‌ ప్రక్రియకు ఇంకా 11 రోజులే గడువు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇంకా 45.57 శాతమే డిజిటలైజేషన్‌

ముందున్న ములుగు.. అదే వరుసలో జనగామ, జేఎస్‌ భూపాలపల్లి

40–43 శాతంలో హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాలు

ఆగుతూ సాగుతున్న డిజిటలైజేషన్‌... సీరియస్‌గా కలెక్టర్లు, అధికారుల ఫాలోఅప్‌

ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్‌)లో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. బీఎల్‌ఓలు, అన్ని శాఖల సిబ్బంది ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణ, ధ్రువీకరణ, డిజిటలైజేషన్‌ ఇన్‌టైంలో పూర్తికి ఎప్పటికప్పుడు సూచిస్తున్నాం.

– చాహత్‌ బాజ్‌పాయ్‌,

హనుమకొండ కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement