పోలీస్‌ క్రీడాకారులు స్ఫూర్తిగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ క్రీడాకారులు స్ఫూర్తిగా నిలవాలి

Jul 14 2026 4:47 AM | Updated on Jul 14 2026 4:47 AM

పోలీస్‌ క్రీడాకారులు స్ఫూర్తిగా నిలవాలి

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

వరంగల్‌ క్రైం: ఆరోగ్య పరిరక్షణలో పోలీస్‌ క్రీడాకారులు తోటి సిబ్బందికి స్ఫూర్తిగా నిలవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత తెలిపారు. ఇటీవల మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనరేట్‌లో జరిగిన ఐదో రాష్ట్ర స్థాయి పోలీస్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ మొదటి క్లస్టర్‌లో మొత్తం 61 పతాకాలు సాధించిన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ క్రీడాకారులకు సోమవారం వరంగల్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈసభకు సీపీ ముఖ్య అతిథిగా హాజరై పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. అదనపు డీసీపీలు సురేశ్‌కుమార్‌, శ్రీనివాస్‌, బాలస్వామి, ప్రభాకర్‌రావు, ఏసీపీ నాగయ్య, ఆర్‌ఐ స్పర్జన్‌రాజ్‌, తదితరులున్నారు.

బాధితులకు సత్వర న్యాయం చేయాలి

భరోసా కేంద్రానికి వచ్చే వారికి సత్వర న్యాయం చేయాలని సీపీ శ్వేత అధికారులకు సూచించారు. సోమవారం వరంగల్‌ భరోసా కేంద్రాన్ని ఆమె సందర్శించారు. క్రైమ్‌ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, భరోసా కేంద్రం ఇన్‌స్పెక్టర్‌ సువర్ణ, మహిళా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సూర్యప్రసాద్‌, భరోసా ఎస్సై కిరణ్మయి, కౌన్సెలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement