ఏఎంఓ ఉండ్రాతి సుజన్ తేజ
కాళోజీ సెంటర్: ప్రస్తుత విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులు పాఠ్యాంశ బోధనకు పరిమితం కాకుండా డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ నాణ్యమైన బోధన అందించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్ తేజ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం శంభునిపేట ఉన్నత పాఠశాల, కరీమాబాద్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంకు ఆయన హాజరై వినూత్న బోధనా పద్ధతులపై చర్చించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్ నాగేశ్వర్‌రావు, సెంటర్ ఇన్‌చార్జ్‌లు తదితరులున్నారు.


