కేయూ క్యాంపస్: కేయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సెంటర్ ఇన్‌చార్జ్ జాయింట్ డైరెక్టర్‌గా బయోటెక్నాలజీ విభాగం ల్యాబ్ అసిస్టెంట్ డాక్టర్ పుల్లా శ్రీనివాస్‌ను నియమిస్తూ సోమవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచందం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కేయూ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా, కేయూ టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, అఖిల భారత విశ్వవిద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఈ ఉత్తర్వుల కాపీని డాక్టర్ పుల్లా శ్రీనివాస్‌కు వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అందజేశారు. ఓఎస్‌డీ ఆచార్య బి.వెంకట్రామ్‌రెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ పాల్గొన్నారు.


