కొనసాగుతున్న టీజీసీపీగెట్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న టీజీసీపీగెట్‌ పరీక్షలు

Jul 14 2026 4:47 AM | Updated on Jul 14 2026 4:47 AM

కొనసాగుతున్న టీజీసీపీగెట్‌ పరీక్షలు సీపీని కలిసిన ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ సమన్వయంతో పనిచేయాలి లక్ష్మీనర్సింహ శతకం ఆవిష్కరణ

కేయూ క్యాంపస్‌: తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ఈవిద్యాసంవత్సరం 2026–27లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న టీజీసీపీగెట్‌–26 ఆరో రోజు సోమవారం నిర్వహించినట్లు సీపీ గెట్‌ కన్వీనర్‌, కేయూ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రొఫెసర్‌ కె.రాజేందర్‌ తెలిపారు. ఉదయం సెషన్‌లో నిర్వహించిన ఎంఏ ఇంగ్లిష్‌ కోర్సుకు 2,942, మధ్యాహ్నం సెషన్‌లో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ కోర్సుకు 902, సాయంత్రం సెషన్‌లో ఎంఈడీ, ఎంఏ లింగ్విస్టిక్స్‌ కోర్సుకు 1,241 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు.

కాజీపేట అర్బన్‌: హనుమకొండ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ పి.శ్రీనివాస్‌, హనుమకొండ ఎకై ్స జ్‌ ఇన్‌స్పెక్టర్‌ దుర్గాభవానీ సోమవారం వేర్వేరుగా సీపీ శ్వేతను కలిసి మొక్క అందించారు.

హన్మకొండ అర్బన్‌: జనగణన ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పని చేయాలని హనుమకొండ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. జనగణన–27 సన్నద్ధతలో భాగంగా డిస్ట్రిక్ట్‌ సెన్సస్‌ హ్యాండ్‌బుక్‌ (డీసీహెచ్‌బీ) తయారీపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో ప్రారంభమైంది. ఈసందర్భంగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాల సమాచారాన్ని సమగ్రంగా సేకరించి హ్యాండ్‌బుక్‌ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగే శిక్షణలో గ్రామ, పట్టణ డైరెక్టరీల తయారీకి సంబంధించిన తొమ్మిది అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సెన్సస్‌ డైరెక్టరేట్‌ గణాంకాధికారి సతీశ్‌ సమాచార సేకరణ, నమోదు విధానం, డేటా కచ్చితత్వంపై వివరించారు. కార్యక్రమ ంలో గణాంకాధికారి రామ్‌ దయాకర్‌ రెడ్డి, ఎంపీఎస్‌ఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు ఉన్నారు.

విద్యారణ్యపురి: కాకతీయ పద్య కవితా వేదిక ఆధ్వర్యంలో హనుమకొండలో విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులు కవి చంద్ర నర్సింగోజు లక్ష్మయ్య రచించిన శ్రీ లక్ష్మీనర్సింహ శతకం పుస్తకావిష్కరణను సోమవారం నిర్వహించారు. కాకతీయ పద్యకవిత వేదిక అధ్యక్షుడు సమస్యా పృచ్ఛక చక్రవర్తి కందిశంకరయ్య ఈ శతకాన్ని ఆవిష్కరించారు. పద్య కవితా వేదిక బాధ్యులు అన్నావజ్జుల సోంబాబు అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణలో సహృదయ సాంస్కృతిక కార్యదర్శి వనం లక్ష్మీకాంతారావు, విశ్రాంత విద్యాశాఖ అధికారి నన్నపనేని రామేశ్వర్‌రావు, వజ్జల రంగాచార్యులు, శతావధాని చేపూరి శ్రీరామ్‌, డాక్టర్‌ ఎన్‌వీఎన్‌ చారి, కె.రమేశ్‌, జీడికంటి శ్రీనివాసమూర్తి, పల్లేరు వీరస్వామి, అక్కర కరుణాసాగర్‌, గుంటి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement