ఆటపాటలకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ఆటపాటలకు ప్రాధాన్యం

Jul 13 2026 4:31 AM | Updated on Jul 13 2026 4:31 AM

ఆటపాటలకు ప్రాధాన్యం

కాళోజీ సెంటర్‌: ప్రభుత్వ విద్యావ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష అభియాన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ స్థానిక సంస్థల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటో తరగతిలోకి ప్రవేశించే నాటికి పిల్లల్లో ఆశించిన పాఠశాల సంసిద్ధత (స్కూల్‌ రీడీనెస్‌) నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. వరంగల్‌ జిల్లాలో గతేడాది 34 పాఠశాలల్లో విజయవంతంగా నడిచిన ప్రీప్రైమరీ సెక్షన్లకు అదనంగా ఈ విద్యా సంవత్సరం (2026–27) మరో 48 పాఠశాలల్లో వీటిని విస్తరించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పూర్వ ప్రాథమిక కేంద్రాల సంఖ్య 82కు చేరింది. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 1,003 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఎన్‌సీఎఫ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా..

జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం (ఎన్‌సీఎఫ్‌ఎస్‌ 2022) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ తరగతులు పూర్తిగా ఆనందదాయకమైన, ఆటపాటలతో కూడిన వాతావరణంలో సాగాలి. ఎస్సీఈఆర్టీ రూపొందించిన ప్రత్యేక టీచర్స్‌ హ్యాండ్‌బుక్‌ (టీహెచ్‌బీ), స్టూడెంట్‌ వర్క్‌బుక్స్‌ (ఎస్‌డబ్ల్యూబీ) ఆధారంగా బోధన జరగాలి. ప్రతీ విద్యార్థికి భాషా నైపుణ్యాలు (లిటరసీ), గణిత నైపుణ్యాల (న్యూమరసీ) కోసం రెండు ప్రత్యేక వర్క్‌బుక్‌లు ఉచితంగా అందజేయనున్నారు. వీటిని ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా దిద్ది, పెన్నుతో సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత ఆడియో, వీడియో విజువల్స్‌ ఉపయోగించి బోధనను మరింత ఆకర్షణీయంగా మార్చనున్నారు.

హెచ్‌ఎంల పర్యవేక్షణ, ఫీడ్‌ బ్యాక్‌ డైరీ తప్పనిసరి

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య ఈ విద్యా సంవత్సరంలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు ఆటపాటల ఆధారిత అభ్యాసన ప్రధాన ఉద్దేశం. హెచ్‌ఎంలు లేదా సీనియర్‌ ఉ పాధ్యాయులు ప్రతీ వారం (ముఖ్యంగా శుక్రవారం) ఒక తరగతిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇందుకు ప్రత్యేకంగా ఒక ‘ఫీడ్‌బ్యాక్‌ డైరీ’ నిర్వహించి, ఉపాధ్యాయుల ప్లస్‌ పాయింట్లు, మార్చుకో వాల్సిన అంశాలు లిఖితపూర్వకంగా నమోదు చేయాలి.

– బి.రంగయ్యనాయుడు, డీఈఓ, వరంగల్‌

ప్రభుత్వ బడుల్లో

పూర్వ ప్రాథమిక విద్యా విప్లవం

బట్టీల పద్ధతికి స్వస్తి.. పరీక్షలు నిర్వహించడం పూర్తిగా నిషేధం

ఎస్సీఈఆర్టీ సమగ్ర విధివిధానాలు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement