అన్‌మ్యాన్డ్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అన్‌మ్యాన్డ్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

Jul 13 2026 4:31 AM | Updated on Jul 13 2026 4:31 AM

హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌ అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్ల (అన్‌మ్యాన్డ్‌) సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ టీజీ ఎన్పీడీసీఎల్‌ గౌరవాధ్యక్షుడు జి.ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. హనుమకొండ రాంనగర్‌లోని సుందరయ్య భవన్‌లో టీజీ ఎన్పీడీసీఎల్‌ స్థాయి అన్‌మ్యాన్డ్‌ వర్కర్ల సమావేశం ఆదివారం జరిగింది. ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 18 జిల్లాల నుంచి అన్‌మ్యాన్డ్‌ వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్‌లో జరిగిన సమ్మె సందర్భంగా అన్‌మ్యాన్డ్‌ వర్కర్ల జీతంలో కోత విధించి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్‌ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరరావు మాట్లాడుతూ అన్‌మ్యాన్డ్‌ వర్కర్ల సమస్యలను సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ అలువాల స్వామి మాట్లాడుతూ అన్‌మ్యాన్డ్‌ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. యూనియన్‌ ఎన్పీడీసీఎల్‌ కంపెనీ అధ్యక్షుడు ఆంజనేయులు, వరంగల్‌ జిల్లా కార్యదర్శి లడే శ్రీనివాస్‌, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బూర వరుణ్‌ గౌడ్‌, నాయకులు పాండు, ఆనంద్‌, లక్ష్మణ్‌, బాపుగౌడ్‌, రమేష్‌, వెంకటేష్‌, శివ, నరేష్‌, సాయి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement