నల్లబెల్లి: ఉద్యోగంలో ఒత్తిడితో మనస్తాపానికి గురైన కుటుంబ పెద్ద బలవన్మరణానికి పాల్ప డిన ఘటన రంగాపురంలో జరిగింది. స్థానికులు, ఎస్సై సాయిప్రసన్న కుమార్ తెలిపిన వివరా ల ప్రకారం.. రంగాపురం గ్రామానికి చెందిన చీకటి విక్రమ్ (38) నెక్కొండ మండలం పత్తిపా క విద్యుత్ సబ్ స్టేషన్‌లో నాలుగేళ్లుగా సబ్‌స్టేషన్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో పని ఒత్తిడి, ఉద్యోగం శాశ్వతం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఆది వారం ఉదయం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విక్రమ్–సునంద దంపతులకు వివాహమై 13ఏళ్లు గడిచినా సంతానం కలగలేదు. దీంతో మూడేళ్ల క్రితం 45 రోజుల వయస్సున్న ఓ (శ్రీనిక) పాపను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. చిన్నారి భ విష్యత్ కోసం ఎన్నో కలలుగన్న ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుడి భార్య సునంద ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
వాహన తనిఖీల్లో గంజాయి పట్టివేత?
శాయంపేట: వాహన తనిఖీల్లో సుమారు నాలుగు కిలో గంజాయి దొరికినట్లు సమాచారం. మాందారిపేట స్టేజీ వద్ద పోలీసులు ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. పక్కనే బస్టాప్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి వద్దకు వెళ్లి వివరాలు అడుగగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో సదరు వ్యక్తి వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా సుమారు నాలుగు కిలోలు గంజాయి లభించినట్లు తెలిసింది. గంజాయితోపాటు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
● నల్లబెల్లి మండలం
రంగాపురంలో విషాదం


