వర్షాకాలంలో ఇబ్బందులు కలగొద్దు | - | Sakshi
Sakshi News home page

వర్షాకాలంలో ఇబ్బందులు కలగొద్దు

Jul 5 2026 7:38 AM | Updated on Jul 5 2026 7:38 AM

వర్షాకాలంలో ఇబ్బందులు కలగొద్దు

గ్రేటర్‌ కమిషనర్‌ వెంకన్న

కాశిబుగ్గ: వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నాలాలు, చెరువులు, పారిశుద్ధ్య నిర్వహణ పనులు వేగవంతం చేయాలని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండలోని ఎస్‌బీహెచ్‌ కాలనీ, వడ్డేపల్లి చెరువు, సమ్మయ్యనగర్‌, బృందావన్‌ కాలనీ, పద్మాక్షమ్మ ఆలయ పరిసరాలతో పాటు వరంగల్‌లోని బొందివాగు, అంబేడ్కర్‌నగర్‌, కరీమాబాద్‌, చిన్న వడ్డేపల్లి చెరువు, ఆటోనగర్‌ ప్రాంతాల్లో పర్యటించి పనులు పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని, పూడిక, చెత్త తొలగింపు పనులు వేగవంతం చేయాలని, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. తనిఖీల్లో ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, డాక్టర్‌ రాజారెడ్డి, సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, ఏఈ రవికుమార్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement