21న బ్యాంకు అధికారులకు అర్జీలు అందజేత | - | Sakshi
Sakshi News home page

21న బ్యాంకు అధికారులకు అర్జీలు అందజేత

Sep 9 2026 3:04 AM | Updated on Sep 9 2026 3:04 AM

21న బ్యాంకు అధికారులకు అర్జీలు అందజేత

లక్ష్మీపురం: కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 21న బ్యాంకు అధికారులకు అర్జీలు అందజేయనున్నట్లు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల రామకృష్ణ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని సంఘం కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షులు కందుల శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో వేలాది ఎకరాల దేవాలయ భూములను పేద రైతులు సాగు చేస్తున్నారని, వారికి దేవదాయ శాఖ అధికారులు గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు ఇవ్వాలని కోరారు. పంట వచ్చిన తరువాత కౌలు చెల్లంచేందుకు అనుమతినివ్వాలని కోరారు. కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాట్లాడుతూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ కౌలు రైతులందరికీ వర్తింప చేయాలని, పంట నష్టపరిహారాలు కౌలు రైతులకు కూడా ఇవ్వాలన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కందుల శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ పొడిగింపునకు, నల్లమడ ఆధునికీకరణకు ఒకే సారి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు నీలాంబరం, ఏడుకొండలు, మొగిలయ్య, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల రామకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement