తెనాలి: విదేశాలకు తమ ఉత్పత్తులను పంపుతున్న తెనాలి డబుల్‌హార్స్ గ్రూప్ (టీడీహెచ్) కొంతకాలంగా దేశీయ రిటైల్ మార్కెట్‌పై దృష్టిని సారించింది. ఇందులో భాగంగా విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–65)పై సూర్యాపేట మండలం, రాయన్‌గూడెం గ్రామంలోని సూర్యాపేట హోటల్–7 ప్రాంగణంలో తమ ఆరవ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్‌లెట్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించింది. మధ్యాహ్నం జరిగిన ప్రారంభ వేడుకలో తెనాలి డబుల్‌హార్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్‌ప్రసాద్ మాట్లాడారు. జాతీయ రహదారిపై ప్రయాణీకులకు నాణ్యమైన, పోషకాలతో కూడిన ఉత్పత్తులను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ–హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే ప్రయాణీకులకు ఇకపై వందకు పైగా నాణ్యమైన ఉత్పత్తులు, 130పైగా రకాలను (ఎస్‌కేయూ) ఒకేచోట నేరుగా కొనుగోలు చేయొచ్చని తెలిపారు. వీటిలో తమ బ్రాండ్‌కు చెందిన పప్పుధాన్యాలు, ఫుడ్ ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ (చిరుధాన్యాలు)తో పాటు ప్రీమియం చాకెట్లు, టీడీహెచ్ ఫుడ్స్, మిల్లెట్ మార్వెల్ కౌమ, గోపురం బ్రాండ్ల ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంటాయని వివరించారు. విమాన ప్రయాణికులకు విజయవాడ ఎయిర్‌పోర్టులో, రోడ్డుమార్గాన వెళ్లేవారికి సూర్యాపేట హోటల్–7వద్ద తెనాలి డబుల్ హార్స్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని మోహన్ శ్యాంప్రసాద్ తెలిపారు.
దళితుల హత్యలను పట్టించుకోని ప్రభుత్వం
ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు
గుంటూరు రూరల్: రాష్ట్రంలో ఇప్పటి వరకూ 25 మంది దళితులను హత్యలు చేసి తగలబెట్టినా కూటమి ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టయినా లేదని ఏపీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు ధ్వజమెత్తారు. బుధవారం పెదపలకలూరు గ్రామంలో ఇటీవల అమానుషంగా హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టబడిన దావులూరి ప్రసన్న కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రసన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దావులూరి ప్రసన్నపై ఆగస్టు 13 తేదీన పెట్రోలు పోసి దహనం చేసిన ఘటనలో మరణించిన మాదిగ బిడ్డ ప్రసన్న కుటుంబానికి ఎమ్మార్పీఎస్ అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో వరుస హత్యలు జరుగుతున్నా పాలకుల స్పందన శూన్యమన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పెదపలకలూరూకు చెందిన నిరుపేద టైల్స్ కార్మికుడు దావులూరి ప్రసన్న హత్యతో కలిపి ఇప్పటివరకు ఏకంగా 25 హత్యలు జరిగినా ప్రభుత్వం నిద్రమత్తు వీడకపోవడం దారుణమని మండిపడ్డాడు. ఈ మారణహోమం ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. లక్ష్మీనాయుడు హత్య బాధాకరమే కానీ ఆ కేసులో ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం ప్రకటించినట్టే అదే రీతిలో ప్రసన్న కుటుంబానికి కూడా రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో దళితుల తీవ్ర ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం చవిచూడక తప్పదని సువర్ణ రాజు హెచ్చరించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు రావూరి శ్యామ్, ఇంజుమూరి విజయ్‌కుమార్, తలారి నాని, కేశవరపు దానియేలు, జె.విజయ్, వి.బుజ్జి, ఎన్.రాంబాబు, బాబు, బి.సత్యనారాయణ, పి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
పెదకాకానిలో 35.2 మి.మీ. వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 14 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా పెదకాకాని మండలంలో 35.2 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా పెదనందిపాడు మండలంలో 1.2 మి.మీ వర్షం పడింది. సగటున 8.3 మి.మీ వర్షపాతం నమోదైంది. వివరాలు.. చేబ్రోలు మండలంలో 21 మి.మీ., పొన్నూరు 19.8, తాడేపల్లి 19.6, ప్రత్తిపాడు 14.8, ఫిరంగిపురం 12.2, వట్టిచెరుకూరు 10.2, మంగళగిరి 3.8, గుంటూరు పశ్చిమ 2.8, తెనాలి 2.6, కాకుమాను 2.6, గుంటూరు తూర్పు 1.8, తుళ్ళూరు మండలంలో 1.4 మి.మీ చొప్పున వర్షం పడింది. సెప్టెంబర్ 9వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 43.6 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 40.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
సూర్యాపేట హోటల్–7లో 6వ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్‌లెట్ ప్రారంభించిన చైర్మన్ అండ్ ఎండీ మోహన్ శ్యామ్‌ప్రసాద్


