ముందస్తుగా గుర్తిస్తే నివారించవచ్చు... | - | Sakshi
Sakshi News home page

ముందస్తుగా గుర్తిస్తే నివారించవచ్చు...

Sep 10 2026 2:33 AM | Updated on Sep 10 2026 2:33 AM

ముందస్తుగా గుర్తిస్తే నివారించవచ్చు...

ఆత్మహత్య చేసుకోవాలని మనసులో నిశ్చయించుకున్న వారు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఇంట్లో తమపై ఉన్న బరువు బాధ్యతల్ని ఇతర కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఆస్తిపాస్తుల వివరాలు వెల్లడి చేసి జీవితంలో ఎదగాలంటే ఎలా ఉండాలో జాగ్రత్తలు సైతం పిల్లలకు, కుటుంబ సభ్యులకు వివరిస్తారు. ఇలాంటివారిని తక్షణమే మానసిక వైద్యులకు చూపించడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడకుండా నివారించవచ్చు. కుటుంబ సభ్యులు ఎవరైనా అడిగిన వస్తువు కొనిపించకపోతే చనిపోతామని బెదిరిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తక్షణమే స్పందించి వారిని మానసిక వైద్యులకు చూపించాలి. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం మానసిక రుగ్మత. దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు.

– డాక్టర్‌ వడ్డాది వెంకటకిరణ్‌, మానసికవ్యాధుల వైద్య నిపుణుల సంఘం, జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement