అంతిమయాత్రలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు
గుంటూరు రూరల్: మండలంలోని అంకిరెడ్డిపాలెం గ్రామంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బావ కారుమూరి కోటిరెడ్డి మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా బుధవారం గ్రామంలోని కోటిరెడ్డి నివాసంలో ఆయన పార్థివ దేహానికి వైఎస్సార్ సీపీ నేతలు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర, దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటిరెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, మేకతోటి సుచరిత, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అన్నాబత్తిని శివకుమార్, పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరిఫాతిమా, బలసాని కిరణ్‌కుమార్, అంబటి మురళి, డైమండ్ బాబు, గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి, ఎస్‌ఈసీ సభ్యులు మందపాటి శేషగిరిరావు, పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి నాగార్జునయాదవ్, మాజీ ఇన్‌కంటాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకుడు షేక్ గులాంరసూల్ తదితరులు పాల్గొన్నారు.


