నిరంతర విద్యుత్‌ సరఫరా ప్రధాన లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నిరంతర విద్యుత్‌ సరఫరా ప్రధాన లక్ష్యం

Sep 10 2026 2:33 AM | Updated on Sep 10 2026 2:33 AM

తాడికొండ: ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌– మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.పుల్లారెడ్డి అధ్యక్షతన సీఆర్డీయే అమరావతి సర్కిల్‌ పనితీరుపై రాయపూడిలోని సర్కిల్‌ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్‌ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్‌ లాస్‌ తగ్గింపు, విద్యుత్‌ చౌర్యం నియంత్రణ, విద్యుత్‌ భద్రత, లైన్‌న్లు, ట్రాన్‌న్స్‌ఫార్మర్ల నిర్వహణ, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, సబ్‌స్టేషన్లు, ఫీడర్ల పనితీరు, విద్యుత్‌ అంతరాయాల నియంత్రణ, పీక్‌ డిమాండ్‌ నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎండీ పి.పుల్లారెడ్డి మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వినియోగదారులు కొత్త విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్‌ కోసం ఇకపై ఈ–సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని గౌరవ అధికారిక వెబ్‌సైట్‌ www.a pcpdc.in లేదా ఏపీసీపీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఇంటి నుంచే సులభంగా కొత్త విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్‌న్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సీఎండీ సూచించారు. వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన సమస్యలను స్థానిక అధికారులు వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. వినియోగదారులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement