తైక్వాండోలో గుంటూరు జిల్లా ఓవరాల్‌ చాంపియన్‌ | - | Sakshi
Sakshi News home page

తైక్వాండోలో గుంటూరు జిల్లా ఓవరాల్‌ చాంపియన్‌

Sep 8 2026 1:47 AM | Updated on Sep 8 2026 1:47 AM

తైక్వాండోలో గుంటూరు జిల్లా ఓవరాల్‌ చాంపియన్‌

తెనాలి: అమరావతి తైక్వాండో అసోసియేషన్‌(గుంటూరు) ఆధ్వర్యంలో తెనాలిలో రెండురోజులపాటు నిర్వహించిన 5వ ఏపీ స్టేట్‌ సబ్‌జూనియర్‌, 3వ ఏపీ స్టేట్‌ కిడ్స్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌–2026లో గుంటూరు జిల్లా ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. స్థానిక జేఎంజే మహిళా కాలేజ్‌లో ఈ పోటీలను నిర్వహించారు. విజేతలను సోమవారం సాయంత్రం ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా రన్నర్స్‌గా, అనకాపల్లి తృతీయస్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా చాంపియన్‌షిప్‌లో తెనాలికి చెందిన తైక్వాండో స్పోర్ట్స్‌ అకాడమీ విద్యార్థులు 15 బంగారు పతకాలు, 9 రజత పతకాలు, 10 కాంస్య పతకాలను సాధించారు. పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 300 మంది వరకు పాల్గొన్నారు. అమరావతి తైక్వాండో అసోసియేషన్‌, గుంటూరు కార్యదర్శి బండారు దానిశ్వరరావు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement