డిసెంబరు 1–3 తేదీల్లో దేశవ్యాప్తంగా ‘జైల్‌ భరో’ | - | Sakshi
Sakshi News home page

డిసెంబరు 1–3 తేదీల్లో దేశవ్యాప్తంగా ‘జైల్‌ భరో’

Sep 7 2026 2:56 AM | Updated on Sep 7 2026 2:56 AM

లక్ష్మీపురం: కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ‘బడ్లావ్‌ జరూరీ హై’ నినాదంతో దేశవ్యాప్త పోరాటాలకు సీపీఐ సమరశంఖం పూరించిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా ‘జైల్‌ భరో’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 12 ఏళ్ల మోదీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, రైతులు, కార్మికులు, సామా న్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిత్యావసర ధరలు పెరిగిపోవడం, రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం, దేశంలో మత ఉన్మాదాన్ని పెంచే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. రిజర్వేషన్లను నీరుగార్చే విధానాలను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ విషయంలో అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట చెబు తోందని విమర్శించారు. నీట్‌ పేపర్‌ లీకేజీపై దేశమంతా స్పందిస్తే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చంద్రబాబునా యుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ఏ మాత్రం స్పందించకపోవడం దుర్మార్గం అన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగ ర కార్యదర్శి ఆకిటి అరుణ్‌కుమార్‌, నాయకులు మేడా హనుమంతరావు, రావుల అంజిబాబు, రాధాకృష్ణమూర్తి, బీవీఆర్‌ పాల్గొన్నారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement