మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం శనివారం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఎంపిక చేసిన 85 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో గురుపూజోత్సవాన్ని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా పాల్గొన్నారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు


