జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్‌ డ్రైవ్‌

Sep 5 2026 5:49 AM | Updated on Sep 5 2026 5:49 AM

జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్‌ డ్రైవ్‌

వాహనదారులపై 501 చలానాలు, రూ.3.33 లక్షల జరిమానా

నగరంపాలెం: గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ట్రాఫిక్‌ డ్రైవ్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనల అమల్లో భాగంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది వరకు విస్తృత తనిఖీలు కొనసాగించారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 501 చలానాలు నమోదు చేసి, రూ.3.33 లక్షల జరిమానా విధించారు. హెల్మెట్‌ ధరించని వాహనదారులు, కార్లలో సీట్‌ బెల్ట్‌ ధరించని డ్రైవర్లపై 120 కేసులు, ట్రిపుల్‌ రైడింగ్‌పై 12 కేసులు, ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై 37 కేసులు, అడ్డదిడ్డంగా డ్రైవ్‌ చేసిన వారిపై ఎనిమిది కేసులు, మొబైల్‌ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై 16 కేసులు, వాహనానికి సైలెన్సర్‌ లేని ఒకరిపై ఒక కేసు, 12 మంది మైనర్లపై, మోటారు వాహన చట్ట ఉల్లంఘించిన వారిపై 314 కేసులు నమోదు చేశారు. హెల్మెట్‌ వాడకంపై 18 రోడ్డు భద్రత అవగాహన, 250 మంది డ్రైవర్లు, 300 మంది విద్యార్థులు, 255 మంది ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement