జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీనివాసరావు
గుంటూరు మెడికల్: పీఆర్సీ కమిషనర్‌ను వెంటనే నియమించాలని జిల్లా జేఏసీ చైర్మన్ ఘంటసాల శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ పిలుపుమేరకు గురువారం ఎన్జీవో రిక్రియేషన్ హాలులో గుంటూరు జిల్లా జేఏసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ 5న జరగబోయే రాష్ట్ర జేఏసీ కార్యవర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అందరి అభిప్రాయాల ఇవ్వాలని కోరారు. జిల్లా జేఏసీ కన్వీనర్ మొహమ్మద్ ఖాలీద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్‌లు మాట్లాడారు. జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘం నాయకులు రామకృష్ణ (పి.ఆర్.టి.యు), షేక్ బాజీ (ఎస్టీయూ), షేక్ ఫైజుల్లా (డి.టి.ఎఫ్), రబ్బానీ, ఆంజనేయులు (ట్రెజరీ ), కె.కృష్ణయ్య (పెన్షనర్ సంఘం) జిల్లా జేఏసీ నాయకులు సుకుమార్, సయ్యద్ జానీబాషా, అనిల్, విజయ్ నగర అధ్యక్ష కార్యదర్శులు కళ్యాణ్ కుమార్, కోటేశ్వరరావు, తాజున్నిసా, శ్రీవాణి (మహిళా విభాగం), ప్రోహిబిషన్ ఎక్సయజ్ కానిస్టేబుల్స్ రాష్ట్ర నాయకులు మార్పు కోటయ్య, పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ సుభాని, నర్సింగ్ అసోసియేషన్, నాల్గో తరగతి ఉద్యోగ సంఘం, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


